నాలుగు కెమేరాలు..డైరక్టర్..షాట్ రెడీ…టేక్..అంతే ఓకె. అయిపోయింది. అంతే కానీ మరో టేక్ బాబూ, ఇంకోచెం డెప్ట్ లేదా ఇంకొంచెం గట్టిగా, లేదా ఇంకొంచెం ఎమోషన్ బాబూ లాంటి మాటలు అక్కడ వినపడవు.
సీన్ వివరించడం, నాలుగు వైపుల నాలుగు కెమేరాలు పెట్టడం, సింగిల్ టేక్. ఎలా వచ్చినా ఓకె అనేయడం. ఇదంతా పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న వకీల్ సాబ్ ముచ్చటే.
వేణు శ్రీరామ్ దర్శకుడు ఈ సినిమా షూట్ అంతా ఇలాగే అన్నది టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల కథనం. సీన్ ఎక్సప్లెయిన్ చేయడంతోనే దర్శకుడి పని సరి. సీన్ ఎలా వచ్చినా ఓకె చేసేయడమే. చిత్రమేమిటంటే ఓ ఫైట్ కూడా చకచకా గంటల్లో తీసేసినట్లు తెలుస్తోంది.
బహుశా ఈ ధీమాతోనే కావచ్చు పవన్ వరుసగా మూడు సినిమాలు ఓకె చేసి పెట్టారు. కేవలం 30 రోజుల్లో అయ్యప్పన్ రీమేక్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు.
ఈ నెల మూడో వారంలో మొదలుపెట్టి ఫాస్ట్ గా పూర్తి చేసేస్తారు. ఆ తరువాత క్రిష్ సినిమా. ఆ విధంగా ఈ ఏడాది పవన్ మూడు సినిమాలు పూర్తి చేసేస్తారన్నమాట. వీలయితే హరీష్ శంకర్ సినిమా మీదకు కూడా వెళ్లిపోతారేమో? టెక్నిక్ తెలిసిందిగా.