జేసీ మ‌ర్యాద‌గా మాట్లాడు..డీఎస్పీ వార్నింగ్‌

పోలీసుల చేతిలో మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డికి మ‌రోసారి ప‌రాభ‌వం ఎదురైంది. పోలీసులు జేసీకి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. మ‌ర్యాద‌గా మాట్లాడాల‌ని, నోటిని అదుపులో ఉంచుకోవాల‌ని హిత‌వు చెప్పారు. జేసీ, పోలీసుల మ‌ధ్య వాగ్వాదం…

పోలీసుల చేతిలో మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డికి మ‌రోసారి ప‌రాభ‌వం ఎదురైంది. పోలీసులు జేసీకి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. మ‌ర్యాద‌గా మాట్లాడాల‌ని, నోటిని అదుపులో ఉంచుకోవాల‌ని హిత‌వు చెప్పారు. జేసీ, పోలీసుల మ‌ధ్య వాగ్వాదం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జేసీ నోటి దురుసు ఆయ‌న పెద్ద‌రికానికి మ‌చ్చ తెస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌తంలో టీడీపీ హ‌యాంలో జేసీ దివాక‌ర్‌రెడ్డి అనంత‌పురం ఎంపీగా కొనసాగుతున్నప్పుడు కూడా పోలీసుల‌పై నోరు జారారు. అప్ప‌ట్లో వినాయ‌క నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా తాడిప‌త్రి స‌మీపంలోని ప్ర‌బోధానంద ఆశ్ర‌మం నిర్వాహ‌కుల‌తో స‌మీప గ్రామ‌స్తుల‌కు వివాదం చోటు చేసుకుంది. 

గ్రామ‌స్తుల‌కు మ‌ద్ద‌తుగా  జేసీ రంగంలోకి దిగారు. అయితే ప్ర‌బోధానంద ఆశ్ర‌మ నిర్వాహ‌కులు ఓ ప‌థ‌కం ప్ర‌కారం జేసీని త‌రిమేశారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ దివాక‌ర్‌రెడ్డి పోలీసులపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

జేసీ వ్యాఖ్య‌ల‌పై నాడు  అనంతపురం పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, సీఐ గోరంట్ల మాధవ్ తీవ్ర‌స్థాయిలో స్పందించారు. తమ సొంత మైలేజీ కోసం పోలీసులను చులకన చేసి మాట్లాడితే నాలుక కోస్తానంటూ సీఐ హెచ్చరించారు. 

ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇదో అలవాటుగా మారిందని, ప్రతి విషయంలోనూ పోలీసుల మీద నోరుపారేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా అంటూ మీసం మెలేసి వార్నింగ్ ఇచ్చిన మాధ‌వ్ … ఆ త‌ర్వాత కాలంలో  సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వైసీపీ తీర్థం పుచ్చుకుని, హిందూపురం ఎంపీగా గెలుపొందారు.

తాజాగా మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి తాను ఇంకా అధికారంలోనే ఉన్నాన‌నే భ్ర‌మ‌లో విహ‌రిస్తూ, మ‌రోసారి పోలీసుల‌ను లం…కొడుకులంటూ అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. జేసీ వ్యాఖ్య‌ల‌పై పోలీసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“ఇంత వ‌ర‌కూ ప‌డ్డాం. ఇక మాట ప‌డ‌డానికి సిద్ధంగా లేం. మ‌ర్యాద‌గా మాట్టాడండి. లం…కొడుకులంటే త‌మాషా కాదు. పోలీసు లను ఇష్టారాజ్యంగా దూషిస్తే ఊరుకునేది లేదు. నోరు అదుపులో పెట్టుకో” అని జేసీ దివాక‌ర్‌రెడ్డికి డీఎస్పీ ఆర్ల శ్రీ‌నివాసులు వార్నింగ్ ఇచ్చారు.

తమపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదంటూ సోమవారం తాడిపత్రిలో తన సోదరుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆమరణ దీక్ష చేస్తానంటూ జేసీ దివాకర్‌రెడ్డి  ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఉద్రిక్త‌త నెల‌కుంది.  

తన సోదరుడి ఇంటికి వెళ్లి దీక్ష చేసేందుకు పెద్దపప్పూరులోని తన ఫామ్‌హౌస్‌ నుంచి బయలుదేరిన దివాకర్‌రెడ్డిని డీఎస్పీతో పాటు సీఐలు మురళీధర్‌రెడ్డి, ఇస్మాయిల్, ఎస్‌ఐలు గౌస్, రాజశేఖర్‌రెడ్డి, పోలీసులు అడ్డుకోవ‌డంతో వారిని జేసీ బూతులు తిట్టారు. దీంతో పోలీసులు గ‌ట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. 

నాడు సీఐగా గోరంట్ల మాధ‌వ్ చేసిన హెచ్చ‌రిక‌లు, నేడు డీఎస్పీ వార్నింగ్‌ను గుర్తు చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. జేసీ దివాక‌ర్‌రెడ్డి ప‌దేప‌దే నోరు పారేసుకుంటూ అభాసుపాల‌వుతున్నార‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. 

దేవుడి పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్