ధనుష్ మరో తెలుగు సినిమా

తమిళ యంగ్ సూపర్ స్టార్ అనిపించుకున్న ధనుష్ త్వరలో మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు సినిమాలకు ఓకె చెప్పాడు.  Advertisement సితార ఎంటర్ టైన్ మెంట్స్…

తమిళ యంగ్ సూపర్ స్టార్ అనిపించుకున్న ధనుష్ త్వరలో మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు సినిమాలకు ఓకె చెప్పాడు. 

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న సర్ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే సగం పూర్తయింది. ఆగస్టు తొలివారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

అలాగే నిర్మాత ఆసియన్ సునీల్ నిర్మాతగా దర్శకుడు శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఓ సినిమాకు కూడా ధనుష్ ఓకె చెప్పాడు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ నే తయారు చేస్తున్నారు శేఖర్ కమ్ముల. 

ఈ రెండు ఇలా వుండగా నిర్మాత దిల్ రాజు కూడా ధనుష్ తో సినిమా చేయాలనే ఉత్సాహంతో వున్నారు. ఆయన కూడా ధనుష్ కు ఓ మాంచి కథ వినిపించి లాక్ చేసే పనిలో వున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ అని వినిపిస్తోంది. కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. 

చూస్తుంటే ధనుష్ చెన్నయ్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాల్సి వచ్చేలా వుంది.