సాహో సినిమా తరువాత రాధేశ్యామ్ సినిమా ఓవర్ సీస్ బిజినెస్ విషయంలో ఫెయిలయింది. సరైన బేరాలు రాలేదు. దాంతో 'గ్రేట్ ఇండియా ఫిలింస్' ద్వారా స్వంతంగా విడుదల చేసుకుంది. కానీ లైన్ లో వున్న ప్రభాస్ సినిమాల్లో రెండు సినిమాలకు మాంచి ఓవర్ సీస్ ఆఫర్లు వస్తుండడం విశేషం.
ప్రభాస్ సినిమా ఆదిపురుష్ విషయంలో ఓవర్ సీస్ బయ్యర్లు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. కానీ సలార్, ప్రాజెక్ట్ కే విషయంలో మాత్రం మంచి బేరాలు సాగుతున్నాయని తెలుస్తోంది.
సలార్ ఫస్ట్ పార్ట్ కే ఓవర్ సీస్ లో 50 కోట్లు నిర్మాతలు కోట్ చేస్తున్నారు. దీనికి కాస్త తక్కువగా బేరాలు సాగుతున్నాయి. అలాగే ప్రాజెక్ట్ కే విషయంలో 70 కోట్లు నిర్మాతలు కోట్ చేస్తున్నారు. దానికి కూడా బేరాలు మొదలయ్యాయి.
నిర్మాతలు అనుకున్న రేట్లు వస్తాయా? రావా? అన్న సంగతి పక్కన పెడితే రాధేశ్యామ్ కు 20 కోట్ల మేరకు ఓవర్ సీస్ లో మార్కెట్ జరగలేకపోయింది. ఆదిపురుష్ ను పక్కన పెడితే మిగిలిన రెండింటికి రేటు డిమాండ్ గట్టిగానే వుంది.
సలార్ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ తరువాత ఓవర్ సీస్ బిజినెస్ క్లోజ్ చేసే ఆలోచన లో ఇటు నిర్మాతలు, అటు బయ్యర్లు వున్నట్లు తెలుస్తోంది.