రామ్-పూరి.. మళ్లీ పాత పద్ధతిలోనే..!

పూరి జగన్నాధ్ వర్కింగ్ స్టయిల్ ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. ఓవర్ నైట్ కథ పూర్తిచేస్తారాయన. సింగిల్ సిట్టింగ్ లో డైలాగ్స్ తో కలిపి స్టోరీ రాసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో…

పూరి జగన్నాధ్ వర్కింగ్ స్టయిల్ ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. ఓవర్ నైట్ కథ పూర్తిచేస్తారాయన. సింగిల్ సిట్టింగ్ లో డైలాగ్స్ తో కలిపి స్టోరీ రాసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కథ-స్క్రీన్ ప్లే పై పూరి ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేదనే విమర్శలు కూడా గతంలో వచ్చాయి.

అయితే పూరి-రామ్ వ్యవహారం దీనికి భిన్నం. ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసినప్పుడు పూరి తన సహజ శైలిలో వర్క్ చేయలేదు. రామ్ తో కలిసి చాలా డిస్కషన్స్ జరిపాడు. కథ, క్యారెక్టరైజేషన్ పై ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. అలా ఇస్మార్ట్ శంకర్ వచ్చింది, అప్పట్లో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్టయింది.

ఇప్పుడు మరోసారి రామ్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు పూరి జగన్నాధ్. ఈసారి కూడా తన రెగ్యులర్ స్టయిల్ కు భిన్నంగా రామ్ తో, కథాచర్చలు జరుపుతున్నాడు ఈ దర్శకుడు. పైగా ఇది డబుల్ ఇస్మార్ట్ కావడంతో.. హీరో లుక్, మేనరిజమ్స్, క్యారెక్టరైజేషన్స్ పై సుదీర్ఘంగా చర్చలు జరపాలని నిర్ణయించారు.

రీసెంట్ గానే ఈ సినిమా ఎనౌన్స్ చేశారు. సినిమా ప్రకటించిన రోజునే, వచ్చే ఏడాది మార్చి 8 రిలీజ్ అంటూ విడుదల తేదీ కూడా ఇచ్చారు. లైగర్ తో అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాధ్, డబుల్ ఇస్మార్ట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్లు, టెక్నీషియన్స్ ఎవరనేది ఇంకా లాక్ చేయలేదు.