అనుకున్నవి అనుకున్నట్లు సాగకపోతే ఫ్రస్టేషన్ పీక్స్ లోకి వెళ్లిపోతుంది.. ఎవరికైనా. పైగా అసలే అసహనం లోపల పెట్టుకుని, పైకి అద్భుతంగా నటించే వారు.. ఆన్ రికార్డ్ నుంచి ఆఫ్ రికార్డ్ కు మారిన తరువాత వుంటదీ.. మామూలుగా వుండదు.. విశ్వరూప ప్రదర్శన. ఆంధ్ర రాజకీయాల్లో కీలకమైన ఓ రాజకీయ నాయకుడు ఇలాగే వుంటాడట.
పబ్లిక్ లో చాలా వినయంగా కనిపిస్తాడు. కానీ ప్రయివేట్ లైఫ్ లో తన పర్సనల్ స్టాఫ్ మీద ఊ అంటే చికాకు.. ఆ అంటే చికాకు ప్రదర్శిస్తుంటాడట. ఇటీవల ఆంధ్రలోని తన నివాసంలో వున్న వ్యక్తిగత సిబ్బంది మీద తరచు ఫైర్ అయిపోవడం కామన్ అయిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో చాలా మంది ఫైర్ చేసి, కొత్తవారిని తీసుకున్నారట. మరి ఇంతకీ ఈ ఫ్రస్టేషన్ ఎందుకో? ప్లాన్ ఆఫ్ యాక్షన్ తను అనుకున్నది అనుకున్నట్లు సాగడం లేదనా? అధికారం అందుతుందేమో అనుకుంటే ఎప్పటికప్పుడు దూరంగా జరుగుతున్నందునా? అన్న క్వశ్చను వస్తే…అవేమీ కాదు.. ఆయన అలాగే వుంటాడు.. అందుకే పర్సనల్ స్టాఫ్ తరచు మారిపోతుంటారు.. ఆ ఫ్రస్టేషన్, చికాకులు తట్టుకోలేక అనే సమాధానం వినిపిస్తోంది.