శాకుంతలం కేరాఫ్ దిల్ రాజు

దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం ప్రాజెక్టు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి హీరోయిన్ ను వెదుకుతున్నారు. ఎవ్వరూ సెట్ కాలేదు. ఉన్నట్లుండి సమంత హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు అధికారికంగా బయటకు వచ్చింది.  Advertisement టాలీవుడ్…

దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం ప్రాజెక్టు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి హీరోయిన్ ను వెదుకుతున్నారు. ఎవ్వరూ సెట్ కాలేదు. ఉన్నట్లుండి సమంత హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు అధికారికంగా బయటకు వచ్చింది. 

టాలీవుడ్ జనాలకు కాస్త ఆశ్చర్యం సమంత ఎలా ఒప్పుకుంది? ఎలా ఒప్పించారు అని. కట్ చేస్తే, దీని వెనుక డైరక్షన్ అంతా దిల్ రాజుదే అని తేలింది. సరైన ప్రాజెక్టుల కోసం దిల్ రాజు తెగ తాపత్రయపడుతున్నారు. 

హీరోలు ఖాళీ లేరు, డైరక్టర్లు ఖాళీ లేరు. ఉన్నవాళ్లని యూత్ బ్యాచ్ నిర్మాతలంతా ఎగరేసుకుపోతున్నారు. దిల్ రాజు దగ్గరకు వచ్చేవారు తగ్గిపోతున్నారు. అందుకే శాకుంతలం ప్రాజెక్టు కథ అడిగి తెలుసుకుని, అందులోకి ఎంటర్ అయ్యారు దిల్ రాజు. 

తానే స్వయంగా సమంత ను కలిసి, కథ వివరించి, ఒప్పించారట. ఇక మిగిలింది ఒకటే శాకుంతలం సహనిర్మాతగా దిల్ రాజు పేరు జోడించడం. త్వరలో అది కూడా జరుగుతుందని తెలుస్తోంది. దిల్ రాజు పేరు యాడ్ అయితే, గుణశేఖర్ ప్రాజెక్టుకు కచ్చితంగా క్రేజ్ వస్తుంది.

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించక తప్పని పరిస్థితి

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం