పెద్ద సినిమాలు వస్తుంటే ఆ కళే వేరు. ఆ హడావుడి వేరు. థియేటర్ల దగ్గర తీన్ మార్ సౌండే వేరు. డిసెంబర్ లో పుష్ప..అఖండ సినిమాలు వచ్చాయి. దడ దడ లాడించాయి. బన్నీ ఫ్యాన్స్..బాలయ్య ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు.
కాస్త గ్యాప్ తరువాత భీమ్లా నాయక్ వచ్చింది. థియేటర్లకు థియేటర్లు ఊగిపోయాయి. ఆ సౌండ్ ఇంకా రీసౌండ్ గా వుండగానే రాధేశ్యామ్ వచ్చేసింది.
వన్ డే బిఫోర్ రిలీజ్ థియేటర్లు అన్నీ సందడితో నిండిపోయాయి. ఎర్లీ షో లు, ఫ్యాన్స్ షోలు, ప్రదర్శనలు ఒకటి కాదు హడావుడి. ఎక్కడ చూసినా ఫెక్సీలు, కట్ అవుట్ లు.. మామూలుగా లేదు వ్యవహారం. ప్రభాస్ సినిమాకు బజ్ వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆంధ్రలో ఓ రేంజ్ లో బజ్ వచ్చేసింది. ముఖ్యంగా వెస్ట్ గోదావరిలో హడావుడి చెప్పనక్కరలేదు.
నైజాంలో హైదరాబాద్ సిటీలో మాంచి బజ్ కనిపిస్తోంది. తొలి రోజు స్పెషల్ షో ల సంగతి ఎలా వున్నా, మిగిలిన అన్ని చోట్ల టికెట్ లు అయితే బ్లాక్ అయిపోయాయి. స్పెషల్ షో లకు భారీ రేట్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రలో స్పెషల్ షో లకు అయిదు వందలు ఆ పైన రేట్లు వినిపిస్తున్నాయి.
రాధేశ్యామ్ వచ్చిన రెండు వారాలకు ఆర్ఆర్ఆర్ వస్తోంది. దాని లెవెల్ తెలిసిందే. థియేటర్లు సినిమా సౌండ్ లేకుండానే ఊగిపోతాయి. ఆపైన ఆచార్య..సర్కారు వారి పాట..ఇలా లైనప్ ఫుల్ గా వుంది. టాలీవుడ్ కళ కళ లాడిపోతోంది.