ఊహించినదే.. విజయ్ కు హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం

తమిళనాడ విజయ్ నటించిన సినిమాకు బెనిఫిట్ షోలు ఉంటాయా..? మొన్నటివరకు ఈ అంశంపై చాలా స్పెక్యులేషన్ నడిచింది. అయితే ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత, ఈ అనుమానాలు మరింత పెరగడం విశేషం. దీంతో…

తమిళనాడ విజయ్ నటించిన సినిమాకు బెనిఫిట్ షోలు ఉంటాయా..? మొన్నటివరకు ఈ అంశంపై చాలా స్పెక్యులేషన్ నడిచింది. అయితే ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత, ఈ అనుమానాలు మరింత పెరగడం విశేషం. దీంతో ఈరోజు మరోసారి తమిళనాడు సర్కారు లియో సినిమాపై విస్పష్టంగా ప్రకటన చేస్తూ జీవో జారీచేసింది.

ముందుగా విడుదల చేసిన జీవోలో లియో సినిమాను ఉదయం 4 గంటల నుంచి థియేటర్లలో ప్రసారం చేసేందుకు అనుమతి నిరాకరించింది ప్రభుత్వం. అయితే అందులో స్పష్టమైన సమాచారం లేదు.  4 గంటలకు మిస్సయినా, 5 గంటల నుంచి షో వేసుకోవచ్చని అంతా అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా సంబర పడ్డారు.

అయితే ఈరోజు సవరించిన జీవో విడుదల చేసింది ప్రభుత్వం. లియో సినిమాను రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకోవచ్చని, అయితే ఆ షోలు ఉదయం 9 గంటల నుంచి మొదలవ్వాలని తెలిపింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు.

స్టార్ హీరోల సినిమాల్ని ఉదయం 4 లేదా 5 గంటల షోకు చూడడం ఫ్యాన్స్ కు అలవాటు. ఈ సంస్కృతి తమిళనాడు లో మరీ ఎక్కువ. ఇప్పుడా కల్చర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో అజిత్ సినిమాను ఎర్లీ మార్నింగ్ షో వేస్తే, ప్రమాదవశాత్తూ ఓ అభిమాని మరణించాడు. అప్పట్నుంచి ఎర్లీ మార్నింగ్ షోలు రద్దు చేసింది ప్రభుత్వం.

రీసెంట్ గా రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాలకు కూడా అనుమతులివ్వలేదు. ఇప్పుడు విజయ్ సినిమాకు కూడా అదే విధంగా వ్యవహరించింది. సో.. లియో సినిమా షోలు తమిళనాడు కంటే ముందుగా ఇతర ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. రిలీజ్ టైమ్ కు బజ్ పెరిగితే, హైదరాబాద్ లో ఉదయం 6 గంటలకే షో వేసే అవకాశం ఉంది.