తిరుపతిలో జనసేనకు మీడియా పులి వుంది. మీడియా ముందుకొచ్చి సీఎం వైఎస్ జగన్, మంత్రి ఆర్కే రోజాపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటుంటాడు. సీఎం, వైసీపీ నేతల్ని తిడితే రాయడానికి, చూపడానికి ఎల్లో మీడియా కాచుక్కూచున్న సంగతి తెలిసిందే. పేరు చివర్లో రాయల్ అని తగిలించుకున్న, ఆ రాయల్ కాని రాయల్ నగరిలో తనపై దాడికి వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకుని తోక ముడిచి ఇంటికే పరిమితం అయ్యాడు.
నగరిలో టీడీపీ-జనసేన కలిసి అన్నదానం చేయాలని సంకల్పించాయి. ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి జనసేన ఇన్చార్జ్ వస్తున్నాడని వైసీపీకి తెలిసింది. చాలా కాలంగా మంత్రి రోజాపై అవాకులు చెవాకులు పేలుతుండడం, ఇప్పుడామె నియోజకవర్గానికి వస్తున్న జనసేన నాయకుడిని నిలదీయాలని వైసీపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధమయ్యారు. నగరికి వెళితే తనను చితక్కొడతారని గ్రహించిన జనసేన మీడియా పులి… భయంతో ఇంట్లోనే దాక్కున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో నగరి టీడీపీ ఇన్చార్జ్ గాలి భానుప్రకాశ్ టార్గెట్ కావడం గమనార్హం. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎదురు చూసింది జనసేన నాయకుడి కోసమైతే, మరొకరిపై దాడికి యత్నించడం చర్చనీయాంశమైంది.
నిత్యం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ నోరు పారేసుకోవడం కాదని, దమ్ముంటే జనంలోకి రావాలని వైసీపీ సవాల్ విసురుతోంది. ఇంకోసారి సీఎం, మంత్రి రోజాపై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని నగరి వైసీపీ హెచ్చరిస్తోంది.