పవన్ కల్యాణ్ కొడుక్కి గుండెల్లో పొగ

పవన్ చిన్న కొడుక్కి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం అప్రమత్తమైంది.

సమ్మర్ క్యాంప్ కోసం సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్ చిన్న కొడుకు ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్ లోని ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ చిన్నబ్బాయ్ ఏడేళ్ల మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. కొడుకు ఆరోగ్య పరిస్థితిపై పవన్ స్పందించారు.

“ఉదయం 8.30కి నా భార్య ఫోన్ చేసింది. స్కూల్ లో అగ్నిప్రమాదం అని చెప్పింది. చిన్న ప్రమాదమని అనుకున్నాను. ఆ తర్వాత ప్రమాద తీవ్రత తెలిసింది. ఓ చిన్నారి కూడా మృతి చెందిందని తెలిసింది. చాలామంది పిల్లలకు గాయాలయ్యాయి. మా అబ్బాయి ఎక్కువగా పొగ పీల్చాడు. బాబుకి బ్రాంకోస్కోపీ చేస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నాడు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో, వయసు రీత్యా బాబు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.”

కొడుకును చూసేందుకు కొద్దిసేపటి కిందట సింగపూర్ బయల్దేరారు పవన్ కల్యాణ్. సరదాగా సింగపూర్ సమ్మర్ క్యాంప్ కు వెళ్లి తిరిగొస్తాడనుకున్న కొడుక్కి ఇలా అవ్వడం బాధగా ఉందన్నారు పవన్. మరీ ముఖ్యంగా పెద్ద కొడుకు పుట్టినరోజు నాడే చిన్న కొడుక్కి ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.

పవన్ చిన్న కొడుక్కి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం అప్రమత్తమైంది. వెంటనే సింగపూర్ లోని భారత రాయబార కార్యాలయంతో టచ్ లోకి వెళ్లింది. దీనికి పవన్ కృతజ్ఞత తెలిపారు. తన కొడుకు ఆరోగ్య పరిస్థితిపై వాకబుచేసిన వాళ్లందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

10 Replies to “పవన్ కల్యాణ్ కొడుక్కి గుండెల్లో పొగ”

    1. Nenu pakka ycp party ne. kani prati vishayanni ila egathali cheyakudadu papam evaraithe emi chinna pilladu thvaraga koluukovalani manaspoorthiga devunni prarthiddam.

Comments are closed.