మంచు విష్ణుపై లూటీ, దొంగతనం కేసు

పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్లాను. సరిగ్గా అదే టైమ్ లో విష్ణుతో పాటు దాదాపు 150 మంది దిగారు.

మంచులో మంటలు మళ్లీ మొదలయ్యాయి. కొన్నాళ్లుగా సద్దుమణిగాయని భావించిన వివాదం తిరిగి రాజుకుంది. ఈరోజు స్వయంగా మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కొచ్చి తన అన్న మంచు విష్ణుపై కేసు పెట్టాడు. అది కూడా దొంగతనం కేసు.

“పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్లాను. సరిగ్గా అదే టైమ్ లో విష్ణుతో పాటు దాదాపు 150 మంది దిగారు. శంషాబాద్ లోని నా ఇంట్లోకి అక్రమంగా వెళ్లారు. నా రూమ్స్ అన్నీ పగలగొట్టారు. నా చిన్నప్పట్నుంచి ఉన్న వస్తువులు, మా పిల్లలు, భార్య వస్తువులు పగలగొట్టారు. నగల పెట్టె కూడా పగలగొట్టారు. నా పాప పుట్టినరోజు నాడు, నేను ఊరిలో లేనప్పుడు ఇలా చేయడం ఎంత వరకు కరెక్టో ఆలోచించాలి.”

లూటీ, దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ మొత్తం తీసి పోలీసులకు అందించాడు మంచు మనోజ్. కేవలం ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడమే కాకుండా, తన ఆఫీస్ కు వెళ్లి కారును దొంగిలించారంటూ ఆరోపించాడు మనోజ్. పోలీసులు ఆ కారును మంచు విష్ణు ఆఫీస్ నుంచి స్వాధీనం చేసుకున్నారని అంటున్నాడు.

ఓవైపు బైండోవర్, మరోవైపు హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ.. మంచు విష్ణు ఇలా స్పందించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాడు మనోజ్. ఈ విషయంపై తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు.

2 Replies to “మంచు విష్ణుపై లూటీ, దొంగతనం కేసు”

Comments are closed.