రాజకీయం అంటేనే అంత.. సమయానకూలంగా మాట్లాడుకుంటూ రోజులు నెట్టేయడమే. అవకాశం దొరికినప్పుడెల్లా సొంత డప్పు కొట్టుకుంటూ.. ముందుకు వెళ్లడం మాత్రమే. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా పదవిలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకుడు సోము వీర్రాజు కూడా అదే పనిచేస్తున్నారు. ఎంతో నిబద్ధతతో బిజెపి కోసం ఎంతోకాలంగా పనిచేశానని.. ఈ జీవితానికి తనకు అది చాలునని సోము వీర్రాజు అంటున్నారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ఏర్పడడం, తెలుగుదేశంతో బిజెపి జట్టుకట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని ఆయన అంటున్నారు. నిజానికి పొత్తులు కుదిరిన సమయంలో తెలుగుదేశాన్ని ఎన్డీయే జట్టులో కలుపుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్థానిక బిజెపి నేతల్లో సోము వీర్రాజు ప్రముఖులు. ఇప్పుడు సమయానుకూలంగా మాట మార్చారు.
అదే తరహాలో.. అందని ద్రాక్ష పుల్లన అనే నీతి కూడా ఆయనకు బాగానే తెలిసినట్టుంది. తనకి ఖచ్చితంగా దక్కదని తెలిసిన దాని విషయంలో.. అసలు తనకు ఆసక్తే లేదని చెప్పుకోవడం ద్వారా.. సోము వీర్రాజు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. విషయం ఏంటంటే.. ఎమ్మెల్సీగా పదవి స్వీకరించిన తర్వాత.. తొలిసారి రాజమండ్రికి వచ్చిన ఆయనకు బిజెపి ఘనమైన సత్కారం ఏర్పాటుచేసింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి మీద తనకు ఎలాంటి ఆశ లేదని అన్నారు.
అంతటితో ఊరుకోలేదు. మంత్రి కావాలనే ఉద్దేశం తనకు ఉంటే.. 2014లోనే అయి ఉండేవాడినని కూడా చెప్పుకొచ్చారు. అక్కడికేదో.. ఆయన అడగడమే తడవుగా మంత్రి పదవిని కట్టబెట్టేయడానికి చంద్రబాబునాయుడు ‘జీహుజూర్’ అన్నట్టుగా సిద్ధంగా ఉంటారనే సంకేతాల్లాగా…సోము వీర్రాజు చెప్పడం తమాషాగా ఉంది. తాను త్యాగం చేయడం వల్లనే పార్టీలోని ఇతరులకు మంత్రి పదవులు వచ్చాయని అర్థం వచ్చేలా ఆయన మాటలు ఉన్నాయని, ఆయన సోము వీర్రాజు కాదని, త్యాగరాజు అని జనం జోకులేసుకుంటున్నారు.
సోము వీర్రాజు చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని.. జగన్ కు సహకరిస్తూ వచ్చారనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. పైగా ఆ సమయంలో చంద్రబాబు మీద తీవ్రంగా విరుచుకుపడే బిజెపి నాయకుల్లో ఆయన ఒకరు. పైగా 2024 ఎన్నికల సమయంలో ఆయన ఎక్కడా కూటమికి అనుకూల ప్రచారంలో కూడా కీలకంగా పాల్గొనలేదు.
అయినా సరే.. పార్టీ అధిష్ఠానం వద్ద విన్నవించుకుని.. ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. అలాంటిది.. మంత్రి పదవి తాను వద్దనుకున్నాను గనుక వదిలేశాను అంటూ మాట్లాడడం చిత్రంగా ఉంది.
che ee veerraju maripoyadu,
reddy, ika nuvvu GVL ki elivation modalu pettu
జాయిన్ కావాలి అంటే
మంత్రి పదవి కన్నా అన్నయ్య ఇచ్చే ప్యాకేజ్ ముద్దు అనుకుంటా