ఆ హీరోయిన్ ను బ్యాడ్ గా చూపిస్తాడంట!

ఇప్పటివరకు తెరపై హీరోలు మాత్రమే బూతులు మాట్లాడారు. సెన్సార్ లో కట్ అవుద్ది లేదా మ్యూట్ పడుతుందని తెలిసి కూడా విచ్చలవిడిగా మాట్లాడారు. Advertisement ఎప్పుడూ హీరోలే ఎందుకు బూతులు మాట్లాడాలి. హీరోయిన్లు ఎందుకు…

ఇప్పటివరకు తెరపై హీరోలు మాత్రమే బూతులు మాట్లాడారు. సెన్సార్ లో కట్ అవుద్ది లేదా మ్యూట్ పడుతుందని తెలిసి కూడా విచ్చలవిడిగా మాట్లాడారు.

ఎప్పుడూ హీరోలే ఎందుకు బూతులు మాట్లాడాలి. హీరోయిన్లు ఎందుకు మాట్లాడకూడదనే ఆలోచన వచ్చినట్టుంది నాగవంశీకి. తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ ను అలానే చూపించబోతున్నాడు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, వైష్ణవి చైతన్య.

“మా నెక్ట్స్ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఇప్పటివరకు ఓ రకంగా చూశారు ఆమెని. మేం ఆమెను చాలా మాస్ గా చూపించబోతున్నాం. వైష్ణవిని చివరిసారి పద్ధతిగా చూసేయండి. మా సినిమాలో ఆమె మామూలుగా ఉండదు. అన్నీ బూతులే మాట్లాడుతుంది. మోడ్రన్ బూతులు మాట్లాడుతుంది. నా సినిమాలో ఈ అమ్మాయిని చాలా బ్యాడ్ గా చూపిస్తాం.”

ఓ హీరోయిన్ కు నాగవంశీ ఇచ్చిన ఎలివేషన్ ఇది. త్వరలోనే ఆ సినిమా సంగతులు బయటపెడతానంటున్నాడు ఈ నిర్మాత.

4 Replies to “ఆ హీరోయిన్ ను బ్యాడ్ గా చూపిస్తాడంట!”

  1. ఎంత పద్ధతి గా ఆడవారిని చూపించాల్సింది పోయు ఎంత బరితెగించిన దానిలా చూపిస్తాం అనే స్థాయుకి వచ్హేసాం

Comments are closed.