నటుడు, రచయిత, దర్శకనిర్మాత ఐన మనోజ్ కుమార్ తన 87వ ఏట ఏప్రిల్ 2న మరణించారు. తన బలమేమిటో, బలహీనతేమిటో గ్రహించి తనకు తగిన మార్గాన్ని ఎంచుకుని విజయాన్ని అందుకున్న వ్యక్తిగా మనం అతన్ని శ్లాఘించవచ్చు. అతని మరణవార్తల్లో ‘మిస్టర్ భారత్’గా అతన్ని గుర్తించడంతో అతను దేశభక్తుడి పాత్రలు మాత్రమే వేశాడని అనుకోవడం సరి కాదు. శశి కపూర్‌లా అందమైన, ఆడవాళ్లు మెచ్చే నటుడిగా అతను పేరు తెచ్చుకున్నాడు. దిలీప్ కుమార్‌ను ఆరాధించి అతని ‘‘శబ్నమ్’’ సినిమాలో పాత్ర పేరునే తన స్క్రీన్ నేమ్‌గా పెట్టుకున్న మనోజ్ నటనలో దిలీప్ దరిదాపులకు రాలేకపోయాడు. అతని హిట్ సినిమాల్లో కూడా ఓహో అనేలా నటనను ప్రదర్శించ లేకపోయాడు. నటనలో తన పరిమితులు గమనించి, తన రచనాకౌశలంపై దృష్టి పెట్టి, క్రమేపీ దర్శకత్వం వైపు మళ్లి, యితరుల చేత మంచి నటన రాబట్టగలిగాడు. తన కంటూ ఒక బ్రాండ్ తయారు చేసుకుని, కొద్దికాలంలోనే నిర్మాతగా మారి బ్లాక్‌బస్టర్లు తీశాడు. రెండు దశాబ్దాలు అలా వెలిగి, తర్వాత తను తీసిన సినిమాలు ఆడకపోవడంతో రిటైరై పోయి, శేషజీవితాన్ని, ప్రశాంతంగా గడిపేశాడు.
బిన్ లాడెన్ పట్టుబడిన ఏబటాబాద్‌యే మనోజ్ కుమార్ జన్మస్థలం. 1937లో ఒక మధ్యతరగతి పంజాబీ కుటుంబంలో పుట్టిన అతని అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి. దేశవిభజన సమయంలో రేగిన కలహాల్లో తమ్ముణ్ని కోల్పోయాడు. కుటుంబం దిల్లీకి తరలి వచ్చింది, యితను శరణార్థి క్యాంపుల్లో పెరిగాడు. అవస్థలు పడుతూనే తండ్రి యితన్ని బిఏ చదివించాడు. వాళ్ల బంధువు లేఖ్‌రాజ్ బఖ్రీ బొంబాయిలో సినిమా రంగంలో ఉంటూ సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవాడు. తను తీసిన సినిమా ప్రివ్యూ కోసం దిల్లీ వచ్చి, మనోజ్‌ను చూసి ‘‘వీణ్ని సినిమాల్లోకి పంపించండి. హీరో అవుతాడు.’’ అన్నాడు వాళ్ల నాన్నతో. తండ్రి మనోజ్‌తో నీ యిష్టం అన్నాడు. ఓ రెండు నెలలు పోయాక మనోజ్ దిల్లీ నుంచి బొంబాయి వచ్చాడు. రెండు నెలలైనా ఎక్కడా ఏ వేషమూ రాకపోవడంతో నా సంగతేమిటని లేఖ్‌రాజ్‌ని అడిగాడు. ‘‘ఇక్కడ ఛాన్సు రావాలంటే ఆరు జతల చెప్పులు అరగాలి. నీ మొదటి జతే యింకా అరగలేదు.’’ అన్నాడాయన.
అలా అన్నాడు కానీ తను తీసే సినిమాల్లో చిన్న చిన్న వేషాలిచ్చాడు. అతని ఆఫీసు రంజిత్ స్టూడియోలో వుండడం మనోజ్‌కు లాభించింది. వాళ్లు తీసే సినిమాలలో కొన్ని సీన్లకు యితను అప్పటికప్పుడు డైలాగులు రాసి యిచ్చేవాడు. అలా ఆదాయం వచ్చేది. 1957లో ఓ సారి అశోక్ కుమార్‌కి తన డైలాగులు నచ్చలేదు. మార్పించమన్నాడు. రంజిత్ స్టూడియో ప్రొడక్షన్ మేనేజరు హడావుడిగా మనోజ్‌ను రప్పించి, అప్పటికప్పుడు రాయించాడు. అశోక్‌కు అవి బాగా నచ్చి రైటర్ని తీసుకురండి, చూద్దాం అన్నాడు. చూశాక ‘‘రాయడం మాట సరే కానీ హీరో కావడానికి ప్రయత్నించు.’’ అని సలహా యిచ్చాడు. అశోక్ మెచ్చిన రైటర్ కావడంతో రంజిత్ వాళ్లు రోజూ 3-4 సీన్లు రాయించుకుని డబ్బులిచ్చేవారు.
అశోక్ వాక్కు ఫలించి 1959లో దర్శకుడు ఎచ్ ఎస్ రవైల్ ‘‘కాంచ్ కీ గుడియా’’ లో హీరో వేషం యిచ్చాడు. 1961లో అది రిలీజై ఫెయిలయింది కానీ ఆ సినిమా నిర్మాణంలో వుండగానే యితని నటన నచ్చి 4, 5 సినిమాల్లో హీరోగా బుక్కయ్యాడు. వాటిల్లో దర్శకనిర్మాత విజయ్ భట్ సోదరుడు హర్‌సుఖ్ భట్ తీసిన ‘‘రేశ్మీ రూమాల్’’ ఒకటి. అదీ 1961లో రిలీజై ఫెయిలయింది కానీ దాని రషెస్ చూసిన విజయ్ భట్ తను తీస్తున్న ‘‘హరియాలీ ఔర్ రాస్తా’’లో బుక్ చేశాడు. అది 1962లో రిలీజై మనోజ్‌కు ఫస్ట్ హిట్ అందించింది. దానిలో పాటలు బాగుంటాయి. మాలా సిన్హా బాగుంటుంది. మనోజ్ యాక్టింగ్ ఓకే అన్నట్లుగా ఉంటుంది.
దానిలో మనోజ్‌కు ప్లేబ్యాక్ పాడడానికి శంకర్ జైకిషన్ ముకేశ్, మహేంద్ర కపూర్‌లను ఉపయోగించారు. అప్పట్లో హీరోలందరికీ రఫీయే బై డిఫాల్ట్ పాడేవారు. వీళ్లు ఒకటీ అరా పాడడమంతే! దీని తర్వాతి నుంచి మనోజ్ వీళ్లనే తన ప్లేబ్యాక్ సింగర్స్‌గా ఉపయోగించుకున్నాడు. దీని తర్వాత వచ్చిన మనోజ్ హిట్, రాజ్ ఖోస్లా దర్శకత్వంలో వచ్చిన ‘‘వో కౌన్ థీ?’’ (1964 – తెలుగులో ‘‘ఆమె ఎవరు?’’) అనే మిస్టరీ సినిమా. చక్కటి సస్పెన్స్‌తో పాటు సాధనా, లతా పాటలు ఆ సినిమా సక్సెస్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. రాజ్ ఖోస్లా కొన్ని సీన్లు రాశాక, తక్కిన సీన్లు మనోజ్ చేత రాయించాడు. ఆ సినిమాలో డైలాగులన్నీ యితనే రాశాడు.
విజయ్ భట్ ‘‘హిమాలయ్ కీ గోద్మేఁ’’ (1965 – తెలుగులో ‘‘డాక్టర్ బాబు’’) అనే సినిమా తీస్తూ దాని డైలాగులు కూడా యితని చేత రాయించాడు. ఇవి రాసేటప్పుడు మనోజ్‌కు క్రెడిట్ యిచ్చేవారు కాదు. ఐనా ఓకే అనుకున్నాడు. ఈ దశలో మనోజ్ జీవితాన్ని మలుపు తిప్పిన ‘‘షహీద్’’ (1965) రూపు దిద్దుకుంది. కొన్నాళ్ల క్రితం కేవల్ కాశ్యప్ అనే పబ్లిసిస్టు మనోజ్‌తో సినిమా తీస్తానన్నాడు. నన్ను సాధనాను పెట్టి తీయి అని అడిగాడు మనోజ్. ‘అబ్బే, షహీద్ భగత్ సింగ్ గురించి తీస్తాను’ అన్నాడతను. ‘నన్ను రాయనిచ్చి, డైరక్టు చేయనిస్తే నటిస్తా’ అన్నాడు మనోజ్. భగత్ సింగ్ కథలో హీరోయిన్ ఉండదు. చారిత్రక ఆధారాలు కూడా పెద్దగా లేవు. ఉన్న దానితో తీస్తే డాక్యుమెంటరీలా తయారవుతుంది. గతంలో శమ్మీ కపూర్ హీరోగా తీసిన సినిమాతో సహా భగత్ సింగ్ పై తీసిన రెండు సినిమాలూ ఆడలేదు.
ఇవన్నీ మనసులో పెట్టుకుని మనోజ్ స్క్రిప్టు రాయడం మొదలుపెట్టాడు. మద్రాసు వారు తీసిన సినిమాల్లో పని చేసే రోజుల్లో మద్రాసు లోని ‘‘హిందూ’’ హెడాఫీసుకి వెళ్లి వాళ్ల లైబ్రరీలో కూర్చుని పాత పేపర్లు తిరగేసి, సమాచారం పోగేసి, కథ రాయడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాప పడిన జైలరు మదన్ పురీ పాత్ర, ప్రాణ్ వేసిన కరడుగట్టిన ఖైదీ పాత్ర యివన్నీ కల్పించాడు. భగత్ సింగ్ తల్లి వద్దకు వెళ్లి అనేక వివరాలు రాబట్టాడు. స్క్రిప్టు రాయడం నాలుగైదేళ్లు పట్టింది. రొమాంటిక్ హీరోగా వేసి, సంపాదించిన డబ్బు కొంత పోగుపడింది. కేవల్ కశ్యప్‌ని సహనిర్మాతగా కలుపుకున్నాడు. డైరక్టరుగా రామ్ శర్మ అనే అతని పేరు వేశారు కానీ మొత్తమంతా మనోజే చేశాడు.
సంగీత దర్శకుడిగా పేరున్నవారిని పెడదామని కశ్యప్ అంటే ‘‘కాబూలీవాలా’’ సినిమాలో ‘ఐ మేరే ప్యారే వతన్’ అనే అద్భుతమైన పాట రాసిన ప్రేమ్ ధవన్‌కు గీతరచన, సంగీతరచన రెండూ అప్పగిద్దామన్నాడు మనోజ్. ప్రేమ్ ధవన్ అద్భుతమైన పాటలు అందించాడు. అవి చరిత్రలో నిలిచి పోయాయి. ప్రేమ్ చోప్డా, మన్‌మోహన్‌లకు కెరియర్లో బెస్ట్ అనే పాత్రలు యిచ్చాడు. బ్లాక్ అండ్ వైట్‌లోనే తీసినా, సినిమా అద్భుతంగా ఆడింది. సినిమాపై వచ్చిన లాభాలన్నీ భగత్ సింగ్ తల్లికి యిచ్చేశారు నిర్మాతలిద్దరూ. ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వద్దకు వెళ్లి దిల్లీ ప్రివ్యూకి రమ్మనమని పిలిస్తే ‘చాలా బిజీగా ఉన్నాను, 10 ని.లు వుండి వెళ్లిపోతాను.’ అన్నాడాయన. అన్నవాడు సినిమా చివరిదాకా ఉండి క్లయిమాక్స్ చూసి కళ్లలో నీళ్లు పెట్టుకుని 20 ని.లు ప్రసంగించాడు.
ఆ సినిమా క్లయిమాక్స్ చూసి కంటతడి పెట్టనివాడు ఉండడు. సత్యజిత్ రాయ్ ఆ క్లయిమాక్స్‌ని 32 సార్లు చూశారని మనోజే ఓ సారి చెప్పాడు. క్లోజప్‌లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో తీయడం ఆయనకు బాగా నచ్చిందట. ఈ సినిమాను ప్రశంసిస్తూ శాస్త్రిగారు ‘నేనిచ్చిన జై జవాన్, జై కిసాన్’ నినాదంతో సినిమా తీయవచ్చు కదా’ అని అడిగారు. మనోజ్‌కు ఆ పాయింటు నచ్చి దిల్లీ నుంచి బొంబాయి వస్తూ రైల్లో కూర్చుని స్క్రిప్టు రాసేశాడు. ఏదో యుద్ధం సినిమాగా కాకుండా, గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు వలస రావడాన్ని థీమ్‌గా ఎంచుకుని, అన్నదమ్ముల మధ్య రిలేషన్స్‌తో మంచి ఎమోషన్స్ పండించాడు. గమనించాల్సింది ఏమిటంటే దేశభక్తి అంటూ మనోజ్ వార్ సినిమాలతో చావగొట్టలేదు. దేశంలో ఉన్న అనేక సమస్యలను థీమ్స్‌గా పెట్టుకుని మంచి మెలోడ్రమటిక్ సినిమాలు తీసి మెప్పించాడు.
‘‘ఉప్‌కార్’’ (1967) భారీ బజెట్, కలర్ సినిమా. డైరక్టరుగా తన పేరు తొలిసారి వేసుకుని, తన డబ్బుతోనే తీసిన సినిమా. దానికి ముందు వేసిన అతను వేసిన ‘‘గుమ్‌నామ్’’ (1965), ‘‘దో బదన్’’ (1966), ‘‘సావన్ కీ ఘటా’’ (1966), ‘‘పత్థర్ కే సనమ్’’ (1966), ‘‘నీల్ కమల్’’ (1966) వంటి సినిమాలు హిట్ కావడంతో అతనికి కొంత మార్కెట్ ఏర్పడింది. వీటిల్లో ‘‘గుమ్‌నామ్’’, ‘‘పత్థర్ కే సనమ్’’లలో కొన్ని సీన్లు అతనే డైరక్ట్ చేశాడు. ‘‘నీల్ కమల్’’ తీసేటప్పుడు డైరక్టర్ రామ్ మహేశ్వరి ఒక షాటుని ఒకలా ఫ్రేమ్ చేస్తే, మనోజ్ మరోలా తీయవచ్చని సూచించాడు. రామ్ అంగీకరించ లేదు కానీ, కెమెరామన్ ఫాలి మిస్త్రీకి నచ్చి, ఆ విధంగానే షాటు తీశాడు. అది చూశాక రామ్ మనోజ్‌ను పక్కకు పిలిచి ‘‘నెక్స్ట్ షాట్ ఎలా తీద్దామంటావ్?’’ అని అడిగాడు. మనోజ్‌తో ‘‘దో బదన్’’లో పని చేసిన ఆశా పరేఖ్ కూడా మనోజ్ షాట్స్ విషయంలో, డైలాగ్స్ విషయంలో ఆ సినిమాకు కూడా చాలా సాయం చేశాడని చెప్పింది.
ప్రాణ్‌కి మనోజ్ అంటే చాలా యిష్టం. విలన్ పాత్రలు వేసి విసిగిపోతున్న అతనికి మనోజ్ ‘‘షహీద్’’లో అతనికి భిన్నమైన పాత్ర యిచ్చాడు. దాదాపు జంతువులాటి క్రూరుడు దేశభక్తుల త్యాగానికి చలించిపోయి, పశ్చాత్తాప పడతాడు. ప్రాణ్ ఆ పాత్రలో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు. తన తర్వాతి సినిమా ‘‘ఉప్‌కార్’’లో మలాంగ్ బాబా అనే పూర్తి సాఫ్ట్ పాత్ర యిచ్చి మన్నా దే వాయిస్‌తో ‘కస్మే వాదే..’ అనే పాట కూడా అతనిపై పెట్టాడు. ‘పాటకు నటించి చాలా ఏళ్లయిపోయింది’ అంటూ ప్రాణ్ నెర్వస్‌గా ఫీలైతే తను ఎదురుగా కూర్చుని పాటకు అభినయిస్తూ ఎంకరేజ్ చేశాట్ట. ఆ తర్వాతి నుంచి ప్రాణ్ విలన్ పాత్రల నుంచి కారెక్టరు పాత్రలకు మారిపోయాడు. నటనాపరిధి విపరీతంగా పెరిగిపోయింది. ‘‘ఉప్‌కార్’’లో మనోజ్ తన పాత్ర పేరు విలక్షణంగా భారత్ అని పెట్టుకున్నాడు. అప్పటి నుంచే అదే అతని బ్రాండ్ అయిపోయింది. అందరూ మిస్టర్ భారత్ అని పిలవసాగారు. దానికి తగ్గట్టే అతను దేశసమస్యలపై సినిమాలు తీయసాగాడు.
దానిలో ‘‘మేరే దేశ్‌కీ ధర్తీ…’’ మహేంద్ర కపూర్ కంఠంలో ఖంగుమని మోగి జాతీయగీతం స్థాయికి వెళ్లిపోయింది. ‘‘దీవానోంసే యే మత్ పూఛో’’ అనే విషాద గీతానికి ముకేశ్‌ను ఉపయోగించుకుని, రఫీని ఒక నేపథ్య గీతానికి ఉపయోగించుకున్నాడు. మనోజ్‌లో గొప్ప టెక్నిక్కు ఏమిటంటే సామాజిక స్పృహ పెంచుతున్నానంటూనే కమ్మర్షియల్ ఎలిమెంట్స్‌ను విపరీతంగా వాడుకుంటాడు. ‘‘గులాబీ రాత్ గులాబీ’’ అనే క్లబ్ సాంగ్‌లో అంగాంగ ప్రదర్శనతో అలరించాడు. ఆ పాట చివర్లో డిన్నర్ చేస్తున్న యిద్దరు ఒక ఎముక చీకి కిటికీలోంచి బయట పడేస్తారు. వెంటనే కెమెరా కిటికీ బయటకు షిఫ్ట్ అవుతుంది. ఆ ఎముక కోసం యిద్దరు పిల్లలు కుక్కలతో పోటీపడి ఎగబడతారు. వెంటనే ‘యే కాలీ రాత్ కాలీ’ అంటూ రఫీ గొంతుతో సమాజంలోని అనేక వర్గాల్లో ఆ రాత్రి కాళరాత్రి ఎలా అయిందో వర్ణిస్తూ పాట వస్తుంది. ఆ సినిమాలో నా ఫేవరేట్ సాంగ్ – గుల్షన్ బావ్రా రాసిన ‘‘హర్ ఖుశీ హో వహాఁ’’ !
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మనోజ్ దర్శకనిర్మాతగా మారిపోయాడు. నటుడిగా అతని నటన చాలా ఆక్వర్డ్‌గా ఉండేది. చాలా యిబ్బంది పడుతూ నటించేవాడు. అందంగా వుండేవాడు కానీ హుషారు వుండేది కాదు, ఓ డాన్సూ చేయలేక పోయేవాడు. మరీ ఎమోషనల్ ఘట్టం వస్తే అరచేతిలో మొహాన్ని దాచేసుకునేవాడు. ఈ మేనరిజంను ‘‘ఓం శాంతి ఓం’’లో చాలా దారుణంగా వాడేసుకున్నారు. నిజానికి అతను బిగుసుకుని పోకుండా నటించినది, రాజ్ కపూర్ దర్శకత్వంలో ‘‘మేరా నామ్ జోకర్’’ (1970)లో వేసిన చిన్న పాత్రలోనే! ‘‘ఉప్‌కార్’’ తర్వాత వచ్చిన ‘‘నీల్ కమల్’’ (1968) లో వహీదాకు, రాజ్ కుమార్‌కు వచ్చినంత పేరు యితనికి రాలేదు. ‘‘గుడిగంటలు’’ ఆధారంగా తీసిన ‘‘ఆద్మీ’’ (1968)లో తన ఫేవరెట్ నటుడు దిలీప్‌తో కలిసి నటించిన ఆనందం మిగిలింది కానీ దిలీప్‌కు, వహీదాకు వచ్చినంత పేరు రాలేదు. ఆ పాత్ర తమిళ మూలంలో వేసిన ఎస్ఎస్ రాజేంద్రన్‌కు, తెలుగులో వేసిన జగ్గయ్యకు ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టింది. హిందీ సినిమా పెద్దగా ఆడలేదు కూడా. ఆశా పరేఖ్‌తో వేసిన ‘‘సాజన్’’ (1969) పాటల సాయంతో హిట్టయ్యింది.
ఫర్వాలేదనిపించే నటన కనబర్చిన మనోజ్ యితరుల చేత అద్భుతమైన నటనను రాబట్టి, సినిమాలను హిట్ చేసుకున్నాడు. ‘‘ఉప్‌కార్’’ తర్వాత మరింత భారీగా విదేశాల్లో చిత్రీకరణతో ‘‘పూరబ్ ఔర్ పశ్చిమ్’’ (1970) తీశాడు. ప్రతిభావంతులు మన దేశం విడిచి విదేశాల్లో స్థిరపడి, దేశాన్ని చిన్నచూపు చూడడం అనేది థీమ్. విదేశాల్లో కాపురం పెట్టినవారు అక్కడి విలువలకు అజస్ట్ కాలేక, పాశ్చాత్య సంస్కృతీ ప్రవాహంలో పిల్లలు పడి కొట్టుకుని పోతూ ఉంటే మథన పడడాన్ని ఎత్తి చూపుతూ కథ రాసుకున్నాడు. దీనికి చక్కటి లవ్ స్టోరీని జత పరిచాడు. అప్పట్లోనే మొగ్గ తొడుగుతున్న హిప్పీ కల్చర్, వారు హరే రామ, హరేకృష్ణ అంటూ గంజాయి తాగడం.. యివన్నీ చూపించాడు. దీన్నే విస్తరించి దేవ్ ఆనంద్ ‘‘హరే రామ, హరే కృష్ణ’’ (1971)లో చూపించాడు.
విదేశాల్లో ఉన్న మంచి కాస్త చూపిస్తూనే స్కిన్ షో కూడా ధారాళంగా చూపించాడు. ఇది మనోజ్ టెక్నిక్. ‘ఇది చెడ్డది, దీన్ని మనం ప్రోత్సహించకూడదు’ అంటూనే దాన్ని విపులంగా చూపిస్తాడు. సందేశం యిచ్చినట్లూ ఉంటుంది, కమ్మర్షియల్‌గా ఫెచింగ్‌గానూ ఉంటుంది. హీరోయిన్‌గా సైరా బాను అదరగొట్టేసింది. దీనిలోని ముకేశ్ పాట ‘‘కోయీ జబ్…’’ చాలా బాగుంటుంది. ఈ సినిమా నుంచి ఒక దశాబ్దం పాటు మనోజ్‌కు ఎదురు లేకుండా పోయింది. ‘‘రోటీ కప్‌డా ఔర్ మకాన్’’ (1974 – తెలుగులో ‘జీవన పోరాటం’) లో అమితాబ్, శశి కపూర్‌లను కూడా తీసుకున్నాడు. మధ్య తరగతి వారికి నిరుద్యోగ సమస్య, పేదలకు కూడూ గూడూ గుడ్డ సమస్య అంటూ తీశాడు. దీనిలో ‘‘హాయ్ హాయ్ ఏ మజ్‌బూరీ..’’ పాటను జీనత్ అమాన్‌పై చిత్రీకరించిన విధానం, ముగ్గురు కలిసి గోధుమపిండి కుప్పలో మౌసమీ చటర్జీని గ్యాంగ్ రేప్ చేసిన దృశ్యం వివాదాస్పదమయ్యాయి కానీ బాక్సాఫీసుకి ఉపయోగపడ్డాయి.
ఈ విజయాలు ‘‘పెహచాన్’’, ‘‘సన్యాసి’’, ‘‘బే ఇమాన్’’ వంటి సినిమాలు హిట్ కావడానికి తోడ్పడ్డాయి. డైరక్టరుగా సోహన్‌లాల్ కన్వర్ పేరున్నా మనోజ్‌యే డైరక్టు చేశాడు. ‘‘దస్ నంబరీ’’ (తెలుగులో ‘కేడీ నెంబర్ 1’) కూడా యీ టైములోనే వచ్చి హిట్ అయింది. ‘‘క్రాంతి’’ (1981) సినిమాతో మనోజ్ శిఖరాలకు చేరాడు. ఛత్రపతి శివాజీ నౌకాదళాధిపతి కానోజీ ఆంగ్రా స్ఫూర్తితో సంగా అనే పాత్ర తయారు చేసి, సంస్థానాధీశుల కాలంలో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్రయోధుడిగా కల్పించి, దాన్ని దిలీప్ కుమార్‌కు యిచ్చాడు. సలీమ్ జావేద్‌ల చేత కథ, స్క్రీన్‌ప్లే రాయించి, తను డైలాగులకు పరిమిత మయ్యాడు. తను, శతృఘ్న సిన్హా, శశి కపూర్, హేమమాలిని, పర్వీన్ బాబీ తారాగణంగా భారీగా తీశాడు. హేమమాలినిని ఒక పాటలో సెడక్టివ్‌గా చూపించాడు కూడా. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇక అప్పణ్నుంచి, మనోజ్ పని కొండ దిగడమే అయింది. సినిమాలు ఫెయిలవసాగాయి. తమ్ముడు రాజీవ్ గోస్వామిని హీరోగా, మీనాక్షి శేషాద్రిని హీరోయిన్‌గా పెట్టి తన రచనతో, మరొకరి దర్శకత్వంతో ‘‘పెయింటర్ బాబు’’ (1983) అనే సినిమా తీస్తే అది ఫెయిలయింది. తను రచించి, వేరే వారి దర్శకత్వంలో ‘‘కలియుగ్ ఔర్ రామాయణ్’’ (1987 – తెలుగమ్మాయి మాధవి హీరోయిన్) నిర్మిస్తే ఫెయిలైంది. ఇతను, హేమామాలిని, శతృఘ్న సిన్హా, రాఖీలతో యింకొకరు ‘‘సంతోష్’’ (1989)లో తీస్తే అదీ ఫెయిలైంది. మనోజ్ తను హీరోగా చిరుద్యోగుల అవినీతి సమస్యపై ‘‘క్లర్క్’’ (1989) అనే సినిమాను రేఖ, శశి కపూర్, రాజేంద్ర కుమార్ యిత్యాది భారీ తారాగణంతో తీస్తే అదీ ఫెయిలయింది.
అప్పటికే 52 ఏళ్లు. ఇక హీరోగా వేయడం మానేశాడు. చిన్న కొడుకు కునాల్ గోస్వామిని హీరోగా పెట్టి సినిమాలు తీయిస్తే అవీ ఫెయిలయ్యాయి. చివరగా ‘‘జైహింద్’’ (1999) అని రిషి కపూర్, మనీషా కోయిరాలాలతో తను నటించకుండా దర్శకత్వం వహిస్తూ సినిమా తీశాడు. దానిలో కొడుక్కి పెద్ద వేషమే యిచ్చాడు. అదీ ఫెయిలయింది. తారల డేట్స్ దొరక్క, ఆరేళ్ల పాటు సినిమా నిర్మాణంలోనే ఉండిపోవడంతో థీమ్ పాత బడి అపజయం పాలైందని మనోజ్ చెప్పాడు. ఇక సినీ నిర్మాణం తన వలన కాదనుకుని విరమించుకున్నాడు. కొడుకు సినిమాలు మానేసి వ్యాపారంలోకి దిగాడు. ఇతను ‘‘భారత్ కే షహీద్’ పేర టీవీ సీరీస్ తీద్దామనుకుని, అనుమతులు రాక వూరుకున్నాడు. కారెక్టరు పాత్రలు వేసే పని పెట్టుకోలేదు.
మనోజ్ తీసిన సినిమాల్లో చెప్పుకోదగ్గ గొప్ప సినిమా ఫ్యాక్టరీ వర్కర్‌గా వేసిన ‘‘శోర్’’ (1972). అతని భార్య యాక్సిడెంటులో చనిపోతుంది. ఆ సంఘటన చూసిన కొడుకుకి గొంతు పోతుంది. అతనికి మాట తెప్పించాలని యితనెంతో శ్రమిస్తాడు. కష్టపడి డబ్బు కూడబెట్టి, సర్జరీ చేయిస్తాడు. తీరా అతనికి వాయిస్ వచ్చేసరికి యితనికి యాక్సిడెంటు జరిగి చెవుడు వచ్చేస్తుంది. కొడుకు మాట్లాడడం వినలేక పోతాడు. ఇలాటి థీమ్‌తో పారలల్ సినిమాలే తయారవుతాయి. అగ్నిప్రమాదంలో కొడుక్కి మాట పోవడం అనే థీమ్‌తో కిశోర్ కుమార్ ‘‘దూర్ గగన్ కీ ఛావ్ మేఁ’’ (తెలుగులో ‘‘రాము’’గా వచ్చి హిట్ అయింది) అని 1964లో తీస్తే ఆడలేదు.
దానికి డబుల్ ట్రాజెడీగా క్లయిమాక్స్‌లో తండ్రికి చెవుడు రావడమనేది చేర్చి కూడా మనోజ్ కమ్మర్షియల్ హిట్ చేశాడు. అదీ విశేషం. రౌడీ పిల్లగా వేసిన జయ బాధురీ, కాబూలీవాలాగా వేసిన ప్రేమ్ నాథ్‌లు సినిమా విజయానికి దోహదపడ్డారు. ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలను కూడా కలపడం, డబ్బు సంపాదించడానికి నిర్విరామంగా కొన్ని రోజుల పాటు సైకిల్ తొక్కడం (‘మగ మహారాజు’లో తీసుకున్నారు) యిలాటివి కూడా సినిమాకు నిండుతనాన్ని తెచ్చాయి.
మనోజ్ కుమార్‌కి అసిస్టెంటుగా పని చేసిన చంద్ర బారోట్ తను ‘‘డాన్’’ సినిమాకు దర్శకత్వం వహించినప్పుడు మనోజ్ సలహా పైనే ‘ఖైకే పాన్ బనారస్ వాలా’ పాట పెట్టానని చెప్పుకున్నాడు. సినిమాల్లో రిటైరై పోయాక, 2004లో బిజెపిలో చేరాడు. 2014లో మోదీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చినపుడు సమర్థించాడు. మోదీ ప్రధాని కాగానే యితనికి 2015లో ‘దాదా సాహెబ్ ఫాల్కే ఎవార్డు’ యిచ్చింది ప్రభుత్వం. అంతకు ముందు 1992లో పద్మశ్రీ వచ్చింది. అతను మంచి హోమియోపతి వైద్యుడు కూడా. వివాదరహితుడు, గొప్ప రచయిత, దర్శకనిర్మాత ఐన మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. (ఫోటోలు – ‘‘పూరబ్ ఔర్ పశ్చిమ్’’, ‘‘వో కౌన్ థీ?’’, ‘‘ఉప్‌కార్’’, క్రింద ‘‘దస్ నంబరీ’’, ‘‘సన్యాసి’’)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2025)
కుక్క తోక వంకర అనే పేరు తో ఒక ప్రఖ్యాత కాలమిస్ట్ జీవిత చరిత్ర మీద ఎవరైనా సినిమా తీస్తే బాగుండు
కు!క్క తోక వంకర అనే పేరు తో ఒక ప్రఖ్యాత కాలమిస్ట్ జీవిత చరిత్ర మీద ఎవరైనా సినిమా తీస్తే బాగుండు
Chaala baaga rasaaru. Manoj Kumar jeevithanni andamgaa choopinchaaru. Mee rachana sailiki hatsoff sir.
adi pinda koodu, sodi antha rasthadu
like watching a life of Manoj Kumar
ఓం శాంతి ఓం లో ఆ చెయ్యి అడ్డం పెట్టుకున్న నటుడు ఎవరా అనూ గూగుల్ చేస్తే అప్పుడు తెలిసింది మనోజ్ కుమార్ అనే పేరు! ఆయనకి ఇంత చరిత్ర ఉందని ఇప్పుడు తెలిసింది. Thank you!
ee prasadam, rathalu nammutunnava?
మనోజ్ కుమార్ చేసిన సినిమాల్లో నాకు నచ్చినవి:
గుమ్ నామ్, వో కౌన్ థీ (తెలుగులో జగ్గయ్య గారితో – ఆమె ఎవరు?), ఉపకార్
ఇంకా “గూంఘట్”, “నీల్ కమల్” లలో కూడా మంచి పాత్రలు వేశారు కానీ మొదటి దానిలో అశోక్ కుమార్, రెండో సినిమాలో వహీదా రెహ్మాన్-రాజ్ కుమార్ లే షో మొత్తం నడిపించారు
మీరు గృహస్తి రాయబోయి ఘూంఘట్ రాసినట్లున్నారు. మన తెలుగులో మంచి కుటుంబం అది. నేచురల్ గా అశోక్ కుమార్ షోయే అది. తెలుగులో కూడా నాగేశ్వరరావుకే పేరు వచ్చింది కదా
2015 లో అనుకుంటా హిందీ క్లాసిక్ మూవీస్ చూస్తున్నప్పుడు గృహస్తి, ఘూంఘట్ రెండూ ఒకే రోజు చూసాను. అప్పటి నుండి ఘూంఘట్ ఒకే పేరు గుర్తుండి పోయింది
nee balam, ee greatsite,
nee balam, ee gas-andhra
why deleting my comments ?
మనోజ్ కుమార్ – ఆశా పారేఖ్ లు నటించిన SAAJAN (1969) నుంది గజిని (2005) లవ్ ట్రాక్ కాపీ కొట్టాడు మురుగదాస్.
అదే మళ్ళీ ఆమీర్ ఖాన్ తో హిందీ లో తీసాడు
మనోజ్ కుమార్ గురించి మంచి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు. కృతజ్ఞతలు. ఆయన నటన అంత గొప్పగా ఉండదన్న మాటతో 100% ఏకీభవిస్తున్నాను. కానీ ఒక పేరాలో నీల్ కమల్ 1966లో వచ్చిందని, మరో పేరాలో 1968 లో వచ్చిందని రాశారు. ఇక రోటీ కపడా ఔర్ మకాన్ హిట్ అవ్వడం మూలంగా బే ఇమాన్, పెహచాన్ హిట్ అయ్యాయని రాశారు కానీ ఆ రెండూ రోటీ.. కంటే ముందే విడుదల అయ్యాయి. మనోజ్ క్రాంతి వంటి హిట్ తర్వాత ఆరేళ్లు నాటనకి దూరంగా ఉన్నారు కారణం ఏమైనా తెలుసా?
నీల్ కమల్ 1968. 1966గా రాసినది తప్పు. ఎత్తి చూపినందుకు థాంక్స్. రోటీ.. ఒక్కదాని విజయం వలన అని రాయలేదు. ఈ విజయాలు .. అని బహువచనం వాడాను కాబట్టి ఉప్ కార్ పూరబ్, రోటీ.. గట్రా అనుకోవచ్చు. నటించక పోవడానికి కారణం తెలియదు కానీ, స్టేచర్ అంత పెరిగిపోయిన తర్వాత, అతన్ని ఎకామడేట్ చేస్తూ కథలు రాయడం కష్టమై పోతుంది. పైగా అందం, నటన వున్న యంగ్ హీరోలు వచ్చి పడుతున్న కాలమది. ఇతను సొంత సినిమాల గోలలో తమ సినిమాపై దృష్టి పెట్టడని యితర నిర్మాతలు అనుకుని వుండవచ్చు. ఇతను తమ్ముణ్ని ప్రమోట్ చేయడం, యింకా భారీ సినిమాలు ప్లాన్ చేయడం అడావుడిలో వుండి వుంటాడు.
EMBSprasad-balam-ee-situ. !!!!
leka-pothe-prasadaniki-ledu-food-platu!!!
జాయిన్ అవ్వాలి అంటే
Great article sir
సూపర్
why
EMBSprasadam balam ee-gas-andhra!!!
As always , great article
Mee gata Articles valla Hindi lo Pran ane natudu vunnadani , ippudu manoj kumar ane natudu vunnadani naaku telisindi ,, Thank you sir
మనోజ్ కుమార్ బీజేపీ లో, 2004 లో చేరాడు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు 2014 లో జరిగి 205 లో మనోజ్ కు దాదా ఫా ల్కె అవార్డు వచ్చింది.
ఎదవ, సందర్బం ఏదైనా బీజేపీ మీద నోటతో ఆపానవాయువు వదలటం వీడికి మామూలే
EMBSprasad nee balam ee site
EMBS-prasadam-balam-ee-gas-andhra
nee pindakoodu-prasadu-
nuvvu gossip wirter ki yekkuva, coloumist ki takkuva!!!