కాంగ్రెస్ స్థానాల్లో జనసేన ప్రచారం?

తెలంగాణలో కాంగ్రెస్ బలంగా వుండి, సెటిలర్స్ కూడా గట్టిగా వున్నారు అనుకునే కొన్ని స్థానాలను ఎంపిక చేసుకుని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం సాగిస్తారని తెలుస్తోంది.  Advertisement ఈ నెల…

తెలంగాణలో కాంగ్రెస్ బలంగా వుండి, సెటిలర్స్ కూడా గట్టిగా వున్నారు అనుకునే కొన్ని స్థానాలను ఎంపిక చేసుకుని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం సాగిస్తారని తెలుస్తోంది. 

ఈ నెల 20 నుంచి అయిదు రోజుల పాటు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ పాల్గొంటారు. ఆ తరువాత ఎన్నికల వేడి పూర్తిగా అందుకున్న తరువాత ప్రత్యేకంగా ఎంపిక చేసిన అరడజన్‌ స్థానాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారని తెలుస్తోంది. 

దాదాపు మూడు పదులకు పైగా సీటల్లో జనసేన అభ్యర్ధులు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఏయే స్థానాల్లో పోటీ చేస్తారో కూడా ప్రకటించేసారు.

కానీ ఎన్నికల ప్రకటన వచ్చినా, అభ్యర్ధుల కసరత్తు ఎంపిక ఏదీ మొదలు పెట్టలేదు. ఇప్పటి వరకు పవన్ తెలంగాణకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో తెలియదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను చీల్చడానికే పవన్ ప్లాన్ చేస్తున్నారని, దీని వెనుక భారాస వ్యూహం వుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. 

ఇప్పుడు కేవలం ‘ఎంపిక చేసిన’ కొద్ది స్థానాల్లో మాత్రం పవన్ ప్రచారం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇలా చేస్తే మాత్రం పవన్ పొలిటికల్ కెరీర్ కు మరింత మరక పడుతుంది. జనసేన విజయం కోసం కాకుండా, కాంగ్రెస్ ఓటమి కోసం పని చేసారు అన్న ఫీల్ జనాల్లోకి వెళ్తే గట్టి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

అక్కడ తెలుగుదేశంతో ప్రత్యక్ష పొత్తు, ఇక్కడ భారాస తో పరోక్ష పొత్తు అనే గ్యాసిప్ లు బలంగా వెళ్తే అది అంత బాగుండదు.