ఐపీఎల్ ఫైనల్స్ రసవత్తరంగా సాగింది. అయితే అంతకంటే రసవత్తరంగా రాత్రి గడిచిందని చెబుతోంది స్విగ్గీ. ఓవైపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడం, మరోవైపు వాతావరణం చల్లగా మారడం, ఇంకోవైపు ఊహించని విధంగా మ్యాచ్ లో బ్రేక్స్ రావడంతో.. చాలామంది ఆ నైట్ బ్రేక్స్ ను సద్వినియోగం చేసుకున్నారంటోంది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఓవైపు మ్యాచ్ జరుగుతుంటే, మరోవైపు అదే టైమ్ లో స్విగ్గీ ఇనస్టామార్ట్ ద్వారా 2423 కండోమ్ ప్యాకెట్లను సరఫరా చేసినట్టు ప్రకటించింది స్విగ్గీ. అంతేకాదు.. ఈ వివరాలు వెల్లడిస్తూ, ఓ ఫన్నీ పోస్ట్ కూడా పెట్టింది. “చూస్తుంటే.. ఈ రాత్రి 22 మంది కంటే ఎక్కువమందే ప్లేయర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు” అంటూ ఫన్నీ పోస్ట్ పెట్టింది.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆ ఫీవర్ ను క్యాష్ చేసుకుంటోంది స్విగ్గీ. ఎప్పటికప్పుడు క్రికెట్ కు, తన యాప్ కు లింక్ పెడుతూ నెటిజన్లను ఆకర్షిస్తూ వస్తోంది. ఇక ఫైనల్ మ్యాచ్ టైమ్ లో అది పెట్టిన పోస్ట్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. చాలామంది నెటిజన్లు, ఈ పోస్ట్ పై స్పందించారు.
ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా మోస్ట్ ఆర్డర్డ్ ఫుడ్ గా మరోసారి బిర్యానీ నిలిచింది. సీజన్ మొత్తమ్మీద చూసుకుంటే, నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని, మొత్తంగా 12 మిలియన్ బిర్యానీల్ని డెలివర్ చేసినట్టు స్విగ్గీ ప్రకటించింది.