“ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. ఈ పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మళ్లీ ఈ టీమ్ తో వర్క్ చేయాలని ఉంది.” సినిమా ప్రమోషన్ లో హీరోయిన్లు చెప్పే కామన్ డైలాగ్స్ ఇవి.
అయితే చాలామంది హీరోయిన్లు అయిష్టంగానే చాలా సినిమాలు చేస్తుంటారు. కాకపోతే బయటకు ఆ విషయం చెప్పరు. హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ విషయాన్ని ఒప్పుకుంది. కాకపోతే ఆ సినిమా పేరు మాత్రం చెప్పనంటోంది.
“ఆ సినిమా పేరు మాత్రం బయటకు చెప్పను. కానీ ఆ సినిమా అనుభవం మాత్రం పరమ చెత్త. అసహ్యమేసింది. సెట్స్ లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే నాకిచ్చే డైలాగ్స్ చెత్తగా ఉండేవి. అస్సలు సెన్స్ లేని డైలాగ్స్ అవి. ఓ ఆడ బొమ్మలా కూర్చునేదాన్ని, స్వతహాగా నేను ఆ టైపు కాదు. అందుకే ఆ సినిమా నాకు నచ్చదు.”
తన వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇలా కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇచ్చింది. బర్గర్స్ కంటే పరాటాలు తినడమే తనకిష్టమని ప్రకటించిన ఈ ముద్దగుమ్మ.. తను తరచుగా చెప్పే అబద్ధాన్ని కూడా బయటపెట్టింది. ఎవరైనా ఫోన్ చేస్తే.. “వచ్చేస్తున్నా, దారిలోనే ఉన్నా” అంటూ వెంటనే అబద్ధం చెప్పేస్తానని, తను అలా అంటే నమ్మొద్దని కూడా చెబుతోంది.
ఇక తరచుగా అద్దం చూసుకుంటారా అనే ప్రశ్నకు కూడా ఠక్కున సమాధానం ఇచ్చింది ప్రియాంక. ఎక్కడ ఏ చిన్న అద్దం కనిపించినా అందులో తన మొహం చూసుకోవడం తనకు చిన్నప్పట్నుంచి అలవాటని తెలిపింది. చివరికి షాపింగ్ మాల్ లో చిన్న స్పూన్ కనిపించినా, అందులో తన ముఖం చూసుకుంటానని నవ్వుతూ బదులిచ్చింది.