ఆర్జీవీ ‘వ్యూహం’ ఇదన్న మాట

ఆర్జీవీ నిర్మించిన వ్యూహం ట్రయిలర్ విడుదలైంది. ఆంధ్ర ప్రదేశ్ వర్తమాన రాజకీయాల మీద ఆర్జీవీ వ్యూహం సినిమాను నిర్మించడం ప్రారంభించారు. తరువాత ఇటీవలే దాన్ని రెండు భాగాలుగా ప్రకటించారు. తొలిభాగం వ్యూహం ట్రయిలర్ లో…

ఆర్జీవీ నిర్మించిన వ్యూహం ట్రయిలర్ విడుదలైంది. ఆంధ్ర ప్రదేశ్ వర్తమాన రాజకీయాల మీద ఆర్జీవీ వ్యూహం సినిమాను నిర్మించడం ప్రారంభించారు. తరువాత ఇటీవలే దాన్ని రెండు భాగాలుగా ప్రకటించారు. తొలిభాగం వ్యూహం ట్రయిలర్ లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి అనుకున్న దగ్గర నుంచి సినిమా ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న సంఘటనలు అన్నీ డాక్యుమెంట్ చేస్తూ, దాంతో పాటు తన పెర్ సెప్షన్ ను, తన ఊహగానాన్ని ఆర్జీవీ జోడంచినట్లు కనిపిస్తోంది.

జగన్ ను ఎవరెవరు ఎలా టార్గెట్ చేసారు, వారు ఎంత కసిగా మాట్లాడారు. ఎంత పగబట్టారు అన్నవి విజువలైజ్ చేసారు. పనిలో పనిగా జగన్ సతీమణి భారతి అంతరంగం కూడా ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. టోటల్ ట్రయిలర్ చూస్తే జగన్ ను సోనియా, చంద్రబాబు అండ్ అదర్స్ కలిసి టార్గెట్ చేసినట్లు క్లారిటీ గా కనిపిస్తుంది.

పనిలో పనిగా పవన్ ను కాస్త టార్గెట్ చేసారు. చంద్రబాబు ను నమ్మి పవన్ మోసపోతారని చెప్పేసారు. అన్ని పుస్తకాలు చదివినా పవన్ రాంగ్ రూట్ లో వెళ్తున్నారన్న హింట్ ఇచ్చారు.

ఆర్జీవీ సినిమాల్లో వుండే బిగువు, సీన్ ఎస్టాబ్లిష్ మెంట్, డ్రామా పండడం వంటివి ఈ సినిమాలో కాస్త తక్కువ వున్నట్లు తెలుస్తోంది. కేవలం జగన్ కు అనుకూలంగా కథను నడిపించడానికి వీలైన సీన్లు, డైలాగులు తయారు చేసుకుని, సినిమాను చుట్టినట్లు కనిపిస్తోంది. వైకాపా జనాలకు నచ్చుతుంది. తెదేపా జనాలను గిచ్చుతుంది. అంతకన్నా ఏమీ ప్రయోజనం ఈ సినిమా వల్ల వుంటుందని పెద్దగా అనుకోవడానికి అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే జనానికి తెలియని సంగతులు ఏమైనా సినిమాలో వుంటే అప్పుడు దాని మీద ఆసక్తి కలుగుతుంది. అలాంటి వుంటే ట్రయిలర్ లో చోటు చేసుకునేవేమో కదా?