రాజకీయ రచ్చకు బాబు రెడీ?

చంద్రబాబు దాదాపు ఏడాది కాలం తరువాత ఉత్తరాంధ్రాలో పాదం మోపుతున్నారు. గత ఏడాది మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రచారానికి  విశాఖ వచ్చిన టీడీపీ అధినేతను గో బ్యాక్ బాబూ అంటూ ఎయిర్ పోర్ట్ లో…

చంద్రబాబు దాదాపు ఏడాది కాలం తరువాత ఉత్తరాంధ్రాలో పాదం మోపుతున్నారు. గత ఏడాది మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రచారానికి  విశాఖ వచ్చిన టీడీపీ అధినేతను గో బ్యాక్ బాబూ అంటూ ఎయిర్ పోర్ట్ లో ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు. అలా బాబు అటునుంచి   హైదరాబాద్ కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకు మళ్ళీ విశాఖలో ఆయన  కాలు పెడుతున్నారు.

ఈసారి కూడా బాబు వస్తున్నది రాజకీయ రచ్చ కోసమేనని వైసీపీ నేతలు అంటున్నారు. విజయనగరం జిల్లాలోని రామతీర్ధాలు లో ఇటీవల‌ శ్రీరాముని శిరస్సుని కొందరు దుండగులు ఖండించి చెరువులో పారవేసిన సంగతి విధితమే.

ఈ విషయంలో ఇప్పటికే జగన్ సర్కార్ మీద తమ్ముళ్ళు విషం కక్కుతూ నామా మాటలు అంటున్నారు. దేవుళ్ళకు కూడా రక్షణ లేదు అంటూ చంద్రబాబు అదే పనిగా  ట్వీట్లు కూడా వేస్తున్నారు. ఇపుడు అర్జంటుగా ఆయన కొత్త ఏడాది రెండవ రోజునే ఉత్తరాంధ్రా టూర్ పెట్టుకోవడం వెనక రాముడి మీద భక్తా లేక‌ రాజకీయ ప్రసాదం మీద భక్తా అంటూ వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ విద్వంశం వెనక టీడీపీ ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. రామతీర్ధాలుకు కొందరు టీడీపీ నాయకులు వెళ్ళి వచ్చిన  తరువాతనే ఈ దుర్ఘటన జరిగింది అని ఆయన చెబుతున్నారు. 

ఆధారాలు సేకరించి దోషులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళకు ఉత్తరాంధ్రా వస్తున్న బాబు ఏ రాజకీయ రచ్చకు తెర లేపుతారో అన్న చర్చ అయితే సర్వత్రా ఉంది.

సంక్షేమ నామ సంవ‌త్స‌రం!

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు