మనలో ప్రతిఒక్కరం చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసివుంటాం.
ఎప్పుడైనా మీ ఎమ్మెల్యే మీకు, నూతన సంవత్సరం రోజున గ్రీటింగ్ కార్డు పంపి, అందులో ప్రజలకు జవాబుదారీతనంగా తాను నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వివరించిన సందర్భం ఉందా, ఎవరన్నా ఇలా చేసారు అని మీరు విన్నారా!.
గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఈ మంచి పని చేసి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
గత ఎన్నికల్లో ఈయన వైసీపీ పార్టీ తరపున పోటీచేసి, కమ్మ సామజిక వర్గం ఎక్కువుగా ఉండి, టీడీపీ కంచుకోట భావించే వినుకొండ లో దాదాపు 30వేల మెజారిటీ తో గెలుపొందారు.
గెలిచినప్పటి నుండి ప్రతినిత్యం నియోజకవర్గంలో ఉంటూ దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తూ జనంలో మంచి మార్కులు సంపాయించారు.
ఇప్పుడు ప్రతి ఇంటికి తాను చేసిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో 91 వేల ఇళ్లకు గ్రీటింగ్ కార్డు పంపి శభాష్ అనిపించుకున్నారు.