మొన్న బ్రోత‌ల్, నేడు బ్రోక‌ర్‌…ఏంటీ మాట‌లు?

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ రోజురోజుకూ దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. నోటికి ఎంతొస్తే అంత‌, ఏది ప‌డితే అది మాట్లాడ్డం రివాజుగా మారింది. చివ‌రికి సొంత పార్టీ వాళ్లే అస‌హ్యించుకునేలా నారాయ‌ణ విమ‌ర్శ‌లున్నాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.…

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ రోజురోజుకూ దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. నోటికి ఎంతొస్తే అంత‌, ఏది ప‌డితే అది మాట్లాడ్డం రివాజుగా మారింది. చివ‌రికి సొంత పార్టీ వాళ్లే అస‌హ్యించుకునేలా నారాయ‌ణ విమ‌ర్శ‌లున్నాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌మ్యూనిస్టు నాయ‌కుల మాట‌ల‌కు విలువ ఉండేది. వారు ఏది మాట్లాడిన సంస్కార‌వంతంగా, స‌హేతుకంగా మాట్లాడ్తార‌నే పేరుంది. సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ పుణ్య‌మా అని వామ‌ప‌క్ష పార్టీలంటేనే జుగుప్స క‌లుగుతోంది.

తాజాగా ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌పై నారాయ‌ణ వివాదాస్ప‌ద‌, అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ గ‌వ‌ర్న‌ర్‌ను బ్రోక‌ర్‌గా, హెడ్‌క్ల‌ర్క్‌గా అభివ‌ర్ణించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఇటీవ‌ల బిగ్‌బాస్ రియాల్టీ షోపై కూడా నారాయ‌ణ తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్‌ను బ్రోత‌ల్ హౌస్‌గా నారాయ‌ణ తీవ్రంగా దూషించారు. అలాగే ఆ షో హోస్ట్ నాగార్జున అంటే త‌న‌కు అస‌హ్యం క‌లుగుతోంద‌ని ఆయ‌న అన్నారు.

ఇవాళ నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య బ్రోక‌ర్‌గా ఏపీ గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న హెడ్‌క్ల‌ర్క్‌గా ప‌ని చేస్తున్న‌ట్టుంద‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ వ‌య‌సు రీత్యా పెద్దవాడు కావ‌చ్చ‌ని, కానీ చ‌ర్య‌ల రీత్యా చిల్ల‌ర ప‌నులు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. దేశ వ్యాప్తంగా గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను త‌మ పార్టీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంద‌న్నారు.

ఏపీ గ‌వ‌ర్న‌ర్ రాజ‌కీయంగా అనుభ‌వం ఉన్న వార‌న్నారు. మంత్రిగా కూడా ప‌ని చేశార‌న్నారు. అలాంటి వ్య‌క్తి గ‌వ‌ర్న‌ర్‌గా వ‌స్తే జ‌గ‌న్ లాంటి ముఖ్య‌మంత్రిని సెట్‌రైట్ చేస్తార‌ని అనుకున్నామ‌న్నారు. కానీ జ‌గన్ చెప్పిన చోటల్లా సంత‌కం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని శాసనసభ సమావేశంలో బహిష్కరించిందని తెలిపారు.  

ఎలక్షన్ కమిషన్ విషయంలో చర్యలు తీసుకునే అధికారం కేవ‌లం పార్లమెంట్‌కు తప్ప ఎవరికీ లేదని అన్నారు. అలాంటిది నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ను ఎస్ఈసీగా తొల‌గించే ఫైల్‌పై కూడా గ‌వ‌ర్న‌ర్ సంత‌కం చేశార‌న్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న బాల్య చాపల్య చర్యలను అనుభవంతో కూడిన గవర్నర్ సరి చేయాల్సింది పోయి వంతపాడారని నారాయణ మండిప‌డ్డారు. 

నారాయ‌ణ సంస్కార‌ణ హీనంగా మాట్లాడుతున్నార‌ని నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ల నోటి దురుసు వ‌ల్లే క‌మ్యూనిస్టుల‌కు స‌మాజంలో విలువ లేకుండా పోయింద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.