యూనిట్ కూడా ఫ్లాప్ అని ఒప్పుకున్నట్టేనా..?

స్కంద సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఏదైనా సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే వెంటనే దాన్ని ఓటీటీకి ఇచ్చేస్తారు. అలా కొంతైనా రికవర్ అవ్వొచ్చనేది నిర్మాత ఆలోచన. ఈమధ్య ఓ సినిమా విడుదలైన వారానికే…

స్కంద సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఏదైనా సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే వెంటనే దాన్ని ఓటీటీకి ఇచ్చేస్తారు. అలా కొంతైనా రికవర్ అవ్వొచ్చనేది నిర్మాత ఆలోచన. ఈమధ్య ఓ సినిమా విడుదలైన వారానికే థియేటర్లలోకి వచ్చేసింది. మామా మశ్చీంద్ర లాంటి సినిమాల్ని అనుకున్న గడువు కంటే ముందే స్ట్రీమింగ్ కు ఇచ్చేశారు.

ఇప్పుడు స్కంద సినిమా కూడా లాక్ పీరియడ్ కంటే ముందే స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఇంకా చెప్పాలంటే విడుదలైన 4 వారాలకే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోందని సమాచారం. అంటే దీనర్థం, స్కంద సినిమా ఫ్లాప్ అని మేకర్స్ అంగీకరించినట్టేనా..?

స్కంద సినిమా ఫ్లాప్ అనే విషయం అందరికీ తెలుసు. ఈ సినిమా కంటే తాజాగా వచ్చిన మ్యాడ్ అనే మూవీ బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. ఏరియాస్ తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయింది స్కంద. అయితే ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి ఒప్పుకోడు. తమ సినిమా అమోఘం అంటున్నాడు.

మరి అంత అద్భుతం అనుకున్న సినిమాను నెల రోజులకే ఓటీటీకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. థియేటర్లలో బ్రహ్మాండంగా నడుస్తుందని ఓవైపు చెప్పుకుంటూనే, మరోవైపు ఇలా 30 రోజులకే ఓటీటీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నిజంగా ఆక్యుపెన్సీ అంత బాగుంటే, నిర్మాతల మండలి పెట్టిన రూల్ ప్రకారం తమ సినిమాను ఓటీటీకి ఇవ్వొచ్చు కదా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు, మనం అర్థం చేసుకోవాలంతే. ఇప్పటికే స్కంద సినిమా థియేటర్లలో చుట్టేసింది. ఇవాళ్టికి కూడా థియేటర్ లోపల ఖాళీగా ఉన్న ఫొటోల్ని కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. స్కంద సినిమా స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ-హాట్ స్టార్ వద్ద ఉన్నాయి. ఈ నెలాఖరుకు సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రోమో రన్ అవుతోంది.