మరో ‘మందు’ సినిమా.. ఈసారి ఆంధ్రా వంతు

తెలంగాణ కల్చర్ పై ఈమధ్య చాలా సినిమాలొస్తున్నాయి. కాకపోతే అందులో విపరీతంగా మద్యం సీన్లు పెడుతున్నారు మేకర్స్. దీనిపై కొన్ని విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి అంటే మందుకొట్టడం ఒక్కటేనా అనే వ్యాఖ్యలు…

తెలంగాణ కల్చర్ పై ఈమధ్య చాలా సినిమాలొస్తున్నాయి. కాకపోతే అందులో విపరీతంగా మద్యం సీన్లు పెడుతున్నారు మేకర్స్. దీనిపై కొన్ని విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి అంటే మందుకొట్టడం ఒక్కటేనా అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. వీటిని ఆయా మేకర్స్ కూడా సమర్థవంతంగానే తిప్పికొట్టారు.

ఇకపై 'మందు వాడకం' విషయంలో ఇలా తెలంగాణ కల్చర్ ను మాత్రమే తప్పుపట్టాల్సిన పనిలేదు. పూర్తిగా మద్యం కాన్సెప్ట్ తో ఓ సినిమా వస్తోంది. దీనికి ఆంధ్రా బ్యాక్ డ్రాప్ ఫిక్స్ చేశారు. సినిమా పేరులో కూడా మందు ఉంది. అదే ఫుల్ బాటిల్.

సత్యదేవ్ తాజా చిత్రం ఫుల్ బాటిల్. కాకినాడ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమా మొత్తం మందు చుట్టూనే తిరుగుతోంది. ఈరోజు రిలీజైన టీజర్ చూస్తే ఇదే ఫీలింగ్ కలుగుతుంది ఎవరికైనా.

సినిమాలో హీరో పేరు మెర్కురీ సూరి. ఇతగాడికి మందు పడితే తప్ప బండి నడవదు. పైగా ఈ మందుకు సంబంధించి హీరోకు ఓ వీక్ నెస్ కూడా ఉంది. అదేంటనేది టీజర్ లో చెప్పలేదు. కానీ చూచాయగా తెలుస్తోంది. హీరో మద్యం వ్యసనానికి, ఈ సినిమా కథకు బలమైన లింక్ ఉందనే విషయాన్ని ఫుల్ బాటిల్ టీజర్ ఎస్టాబ్లిష్ చేసింది.

ఈ మందు సంగతి కాసేపు పక్కనపెడితే, ఫుల్ బాటిల్ టీజర్ మాత్రం ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంది. సత్యదేవ్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇదే కాస్త ఫన్ మూవీలా కనిపిస్తోంది.

సత్యదేవ్ తో పాటు బ్రహ్మాజీ, సునీల్ పాత్రల్ని కూడా టీజర్ లో పరిచయం చేశారు. శరణ్ కొప్పిశెట్టి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.