రానా, తేజ కలిసి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఆ మూవీని అధికారికంగా ప్రకటించారు కూడా. గోపీనాధ్ ఆచంట నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాలో ఓ ప్రముఖ మలయాళం స్టార్ కూడా నటించబోతున్నాడు.
ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. రానా-తేజ కాంబోలో రాబోతున్న సినిమాకు రాక్షస రాజు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాదు.. ఎప్పట్లానే ఈ సినిమా కోసం కూడా చాలామంది కొత్తవాళ్లను పరిచయం చేయబోతున్నాడు దర్శకుడు తేజ.
“రానాతో మరో సినిమా చేయబోతున్నాను. ఈ సినిమాకు రాక్షస రాజు అనే టైటిల్ అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ సినిమాలో 45 మంది కొత్తవాళ్లను పరిచయం చేయబోతున్నాను. నా సినిమాలో నటించాలనే ఆసక్తి ఉన్నవాళ్లు నన్ను ఇనస్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. పూర్తి వివరాలు అందులో పెడతాను.”
ఇలా రానాతో చేయబోతున్న సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటించాడు తేజ. అహింస సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇలా తన కొత్త సినిమా టైటిల్ ప్రకటించాడు తేజ.
ఇంతకుముందు రానా-తేజ కాంబోలో నేనేరాజు నేనే మంత్రి సినిమా వచ్చింది. అందులో జోగేంద్ర అనే పాత్ర పోషించాడు రానా. ఆ క్యారెక్టర్ కంటే మరింత బలంగా రాక్షస రాజులో రానా పాత్ర ఉంటుందని తెలిపాడు తేజ.