ఎవరైనా కాస్త నోటెడ్ హీరో నుంచి కాల్ వచ్చి సినిమా చేసుకోండి అంటే ఎగిరి గంతేయని నిర్మాత వుంటారా? వుండరు కానీ టాలీవుడ్ లో ఓ హీరో వైపు నుంచి ఫోన్స్ వచ్చినా నిర్మాతలు పాజిటివ్ గా రెస్పాండ్ కావడం లేదట. అలా అని ఏ బ్యాకింగ్ లేని చిన్న చితక హీరోనా అంటే కాదు. కాస్త బ్యాకింగ్ వున్న హీరోనే. కానీ చేతిలో చేస్తున్న సినిమా తప్ప మరో సినిమా లేదు.
గమ్మత్తేమిటంటే పెద్ద పాపులర్ బ్యానర్లు ఏవీ ఆ హీరో వైపు చూడడం లేదు. చిన్న హీరో దగ్గర నుంచి మిడిల్ రేంజ్ హీరోల మీదుగా పాపులర్ హీరోల వరకు సినిమాలు చేస్తున్న బ్యానర్లు అన్నీ ఈ హీరో విషయంలో మాత్రం ఎందుకు వెనుకంజ వేస్తున్నాయి అన్నది మిలియన్ డాలర్ల్ ప్రశ్న.
గతంలో ఓ సీనియర్ హీరో బ్యానర్ ఈ హీరోతో సినిమా చేయాలనుకుంది. కానీ ఎందుకో ముందుకు వెళ్లలేదు. నిజానికి టాప్ బ్యానర్లు అన్నీ తలుచుకుంటే చకచకా తలో సినిమా చేసేయడం పెద్ద కష్టం కాదు. ఆ మాత్రం మార్కెట్ వుంది. కానీ ఆ ఆలోచనే చేయడం లేదు..ఎక్కడుంది సమస్య..ఎక్కడుంది లోపం.
ఇలా ప్రశ్నించుకుంటే బోలెడు గ్యాసిప్ లు ఏమీ వినిపించడం లేదు. ఒకటే సమాధానం వినిపిస్తోంది. ఒకరి వైపే వేలు చూపిస్తోంది. ఎందుకో మరి? ఈ విషయం హీరోకి తెలియకుండా వుంటుంది అనుకోవడానికి లేదు. తెలిసినా తన కెరీర్ ను పట్టించుకోవడం లేదు అంటే ఇంకేమనుకోవాలో మరి?