తెలుగులో రానంత గ్రాండియర్

బాహుబలి ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల రోజుల్లోకి వచ్చేసింది. దుబాయ్ సెన్సార్ అయిపోయింది. లోకల్ సెన్సార్ లు అయిపోయాయి. క్యూరియాసిటీతో వున్న ఫ్యాన్స్ సినిమా సెన్సార్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. …

బాహుబలి ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల రోజుల్లోకి వచ్చేసింది. దుబాయ్ సెన్సార్ అయిపోయింది. లోకల్ సెన్సార్ లు అయిపోయాయి. క్యూరియాసిటీతో వున్న ఫ్యాన్స్ సినిమా సెన్సార్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాధేశ్యామ్ సినిమా ఇప్పటి వరకు తెలుగు తెరమీద రానంత గ్రాండియర్ గా వుంటుంది. బాహుబలి లాంటి గ్రాండియర్ ను చూసారు. కానీ రాధేశ్యామ్ గ్రాండియర్, కలర్ స్కీమ్ వేరు. 

సినిమాను మల్టీ ఫ్లెక్స్ లు, ఐమాక్స్, ఐనాక్స్ ల్లో చూసేవారు ఆ గ్రాండియర్ చూసి థ్రిల్ ఫీలవుతారని టాక్. సినిమా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ జానర్ లోనే సాగుతుంది.

ప్రేమకథలు నచ్చేవారందరికీ రాధేశ్యామ్ ఆకట్టుకుంటుందని సెన్సారు టాక్ ను బట్టి తెలుస్తోంది. పూజా క్యూట్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టకుంటాయని, పూజాను తీసుకోవడం అసెట్ అని, అలాగే చివరి పది నిమషాలు హాలీవుడ్ సినిమాల రేంజ్ గ్రాఫిక్స్ కనిపించాయని సెన్సారు వర్గాల బోగట్టా.