వారి ఓట్ల‌పై ఆశ‌లు వ‌దులుకున్న బాబు!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ చంద్ర‌బాబు ఓట్ల లెక్క‌లు ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి. ఏఏ వ‌ర్గాలు టీడీపీకి అనుకూల‌మో, వ్య‌తిరేక‌మో ఆయ‌న లెక్క‌లేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు ప్రాధాన్యం ఇవ్వాల‌నే ఆలోచ‌న‌ను బ‌య‌ట పెట్టారు. ఈ సంద‌ర్భంగా ముస్లింలు,…

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ చంద్ర‌బాబు ఓట్ల లెక్క‌లు ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి. ఏఏ వ‌ర్గాలు టీడీపీకి అనుకూల‌మో, వ్య‌తిరేక‌మో ఆయ‌న లెక్క‌లేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు ప్రాధాన్యం ఇవ్వాల‌నే ఆలోచ‌న‌ను బ‌య‌ట పెట్టారు. ఈ సంద‌ర్భంగా ముస్లింలు, క్రిస్టియ‌న్లు, కాపులు-బ‌లిజ‌లు, ఎస్టీలు త‌దిత‌రుల ఓట్ల‌పై ఆశ‌లు వ‌దులుకున్నార‌ని ఆయ‌న ప్రాధాన్యాలే చెబుతున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పొత్తు కుదిరితే కాపులు-బ‌లిజ‌ల్లో మెజార్టీ ఓట్లు త‌మ‌కు వ‌స్తాయ‌ని ఆయ‌న అంత‌రంగం చెబుతోంది.

పొలిట్‌బ్యూరో స‌మావేశంలో చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంలో బీసీలు, మాదిగ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌ని నిర్ణ‌యించ‌డంపై మిగిలిన సామాజిక వ‌ర్గాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. మాదిగ‌ల‌ను ఆర్థికంగా, రాజ‌కీయంగా ప్రోత్స‌హించాల‌ని టీడీపీ సూత్ర‌ప్రాయంగా ఒక నిర్ణ‌యానికి రావ‌డం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి టీడీపీకి ఓట్లు వేయ‌ని సామాజిక వ‌ర్గాల‌ను వేరుప‌రిచిన‌ట్టైంది.

చంద్ర‌బాబు లెక్క ప్ర‌కారం త‌న సామాజిక వ‌ర్గంతో పాటు బీసీలు, మాదిగ‌లు టీడీపీకి ఓటు బ్యాంక్‌గా గుర్తించారు. వైఎస్సార్ హ‌యాంలో నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించార‌నే కార‌ణంతో ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్‌కు ముస్లింలు అండ‌గా నిలుస్తున్నార‌ని చంద్ర‌బాబు బ‌ల‌మైన అభిప్రాయం. అలాగే జ‌గ‌న్ మ‌త విశ్వాస రీత్యా క్రిస్టియ‌న్. దీంతో ఆ మ‌తం వారు కూడా జ‌గ‌న్‌కు అండ‌గా వుంటున్నారు. అలాగే గిరిజ‌నులు కూడా వైసీపీ వెంటే న‌డుస్తున్నారు. రెడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో పేద‌లు, రైతులు కూడా వైసీపీకి అండ‌గా నిలుస్తున్నార‌ని చంద్ర‌బాబు విశ్వ‌సిస్తున్నారు.

ఇక టీడీపీకి విద్యావంతులు, ఉద్యోగులు, అభివృద్ధిని కాంక్షించే ప‌ట్ట‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబీకులు మ‌ద్ద‌తుగా ఉంటార‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌కం. అయితే ఈ సెక్ష‌న్ బ‌ద్ద‌కం వ‌దిలి ఓటింగ్‌కి రావ‌డమే స‌మ‌స్య‌. చంద్ర‌బాబు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌ను ప‌రిశీలిస్తే… ఏఏ వ‌ర్గాలు త‌న‌కు వ్య‌తిరేక‌మో స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది.

అయితే ఇంత కాలం టీడీపీకి బీసీలు బ్యాన్ బోన్‌గా ఉన్న మాట నిజ‌మే. కానీ జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఆ ఓటు బ్యాంక్‌ను బ‌ద్ద‌లు కొట్టి త‌న‌వైపు ఎక్కువ భాగం తిప్పుకున్నారు. చంద్ర‌బాబు లెక్క‌ల్ని చూస్తే, ఆయ‌నకు గెలుపుపై భ‌రోసా లేద‌ని చెప్పొచ్చు. విజ‌యాన్ని అందుకోవాలంటే జ‌గ‌న్ మాదిరిగా సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌లో చంద్ర‌బాబు మ‌రింతగా తెలివి ప్ర‌ద‌ర్శించాలి.