అందరు హీరోలతో సినిమాలు నిర్మించాలన్నది నిర్మాత దిల్ రాజు కోరిక. ఈ లిస్ట్ నందమూరి బాలకృష్ణ పేరు కూడా వుంది. చాలాకాలంగా ఇందుకోసం ట్రయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రాజెక్ట్ సెట్ కాబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు బాలయ్య. ఒకటి గోపీచంద్ మలినేని. రెండోది అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నారు. దీని తరువాత సినిమా కోసం పలువురు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఒకరిద్దరు డైరక్టర్లు కథలు కూడా చెప్పారని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తరువాత సినిమాను దిల్ రాజుకు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దిల్ రాజు ఆస్థాన కథకుడు, ఇటీవల బాలయ్య చాట్ షో కు వర్క్ చేసిన బివిఎస్ రవి చెప్పిన ఓ కథను బాలయ్య కన్సిడర్ చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.
ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా ఫైటింగ్ సీన్లు చేస్తున్నారు. ఈవారం తరువాత మరోసారి కథలు అన్నీ విని ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నది డిసైడ్ చేస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే రెండు సినిమాలు లైన్ లో వుంచిన బాలయ్య మరెన్ని సినిమాలకు ఓకె చెప్పబోతున్నారన్నది ఈవారం తరువాత తెలిసిపోతుంది.