లేటు వయసులో ఘాటు ప్రేమతో నరేశ్–పవిత్ర జంట నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ జంట నటించిన ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. రియల్ లైఫ్‌లో కూడా వీళ్లిద్దరి ప్రేమ, పెళ్లి వ్యవహారం వివాదాస్పదం కావడంతో సినిమా ప్రమోషన్‌కు పనికొస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ ఈ జంట అధికారికంగా పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది పెద్ద చర్చనీయాంశమే.
ఈ నేపథ్యంలో నరేశ్, పవిత్ర ఉమ్మడిగా, విడివిడిగా సినిమా ప్రమోషన్‌కు సంబంధించి విరివిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మళ్లీ పెళ్లి సినిమా గురించి కంటే, రియల్ లైఫ్‌కు సంబంధించిన అంశాలే ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయి. నరేశ్, పవిత్ర పరస్పరం తమ మధ్య గాఢమైన ప్రేమ గురించి జనానికి చెబుతున్నారు. వీళ్లిద్దరూ నటించిన సినిమా కథ కంటే, నిజజీవితంలో చోటు చేసుకున్న అంశాలే ప్రేక్షకులకు ఎక్కువ వినోదాన్ని ఇస్తున్నాయి.
ఈ క్రమంలో పెళ్లికి అడ్డంకులపై తమదైన రీతిలో వాళ్లు సమాధానం ఇస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితంలోని కొన్నింటిని అడ్డంపెట్టుకుని కొందరు తప్పుగా చూపారని పవిత్ర వాపోయారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఆత్మహత్య లేదా ఇంట్లో ఒంటరిగా కూచోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు. తాను ఇవాళ స్వేచ్ఛగా, ధైర్యంగా సమాజంలో తిరగగలుగుతున్నానంటే కేవలం నరేశ్ అండతోనే అని ఆమె చెప్పుకొచ్చారు.
నరేశ్, తాను విజయనిర్మల, కృష్ణగార్లతో పాటు మహేశ్‌బాబును కూడా కలిసినిట్టు పవిత్ర తెలిపారు. మహేశ్‌బాబు- కృష్ణ కుటుంబం తమ జంటను యాక్సెప్ట్ చేసినట్టు పవిత్ర వెల్లడించడం విశేషం. మరి మహేశ్‌బాబు ఏమంటారో చూడాలి. మొత్తానికి తెరపై మళ్లీ పెళ్లి సినిమా ఎలా వుంటుందో కానీ, రియల్ లైఫ్‌లో మాత్రం మస్తు ఎంటర్టైన్మెంట్ను ఈ జంట ఇస్తోందన్న చర్చ నడుస్తోంది.