ఈ మధ్యకాలంలో సినిమా కంటే రాజకీయలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ కనబరుస్తున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తనతో చర్చకు రావాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన ట్వీట్ నేపథ్యంలో తనకున్న ప్రశ్నలను చర్చించాలని కోరారు.
'సీఎం జగన్ పై 31 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని.. దాదాపు అందరి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులో ఉన్నాయని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ న్యాయ ఖర్చులు 70% పెరిగాయని.. ఇలాంటి వారు ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని' ట్వీట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
చంద్రబాబు కౌంటర్ గా ఆర్జీవీ.. 'సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన సీఎం కాకముందే మీరు కేసులు పెట్టారు కదా… అయినప్పటికీ ప్రజలు ఆయనకు భారీ విజయాన్ని అందించారు.. మీపై ఎటువంటి కేసులు లేనప్పుడు ప్రజలు మీమ్మలిని ఎందుకు కోరుకోలేదు సార్ అంటూ… దానిపై తన ఛానల్ లో చర్చిద్దామా?' అంటూ ట్వీట్ చేశారు.
కాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఎల్లో మీడియా, టీడీపీలు పదేపదే ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా గత ఎన్నికల్లో టీడీపీ ఎన్నడూ లేనంత ఓటమిని చూసిన కుడా రాష్ట్రంలో ఇతర సమస్యలు ఏవీ లేనట్లు చంద్రబాబు మళ్లీ అదే స్లోగన్ ఎంచుకోవడం ఆయనకే చెల్లింది.