టైగర్ నాగేశ్వరరావు క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది?

రవితేజ హీరోగా నటించిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గజదొంగ పాత్రలో కనిపించబోతున్నాడు రవితేజ. ఇదొక బయోపిక్ అనే విషయం అందరికీ తెలిసిందే. Advertisement ఒరిజినల్ చూసుకుంటే, గజదొంగ…

రవితేజ హీరోగా నటించిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గజదొంగ పాత్రలో కనిపించబోతున్నాడు రవితేజ. ఇదొక బయోపిక్ అనే విషయం అందరికీ తెలిసిందే.

ఒరిజినల్ చూసుకుంటే, గజదొంగ నాగేశ్వరరావు అనే వ్యక్తిని ఎన్ కౌంటర్ చేసినట్టు చెబుతారు. ఇప్పటికీ స్టువర్టుపురం పరిసర ప్రాంతాల్లో ఎవ్వర్ని అడిగినా ఇదే మాట చెబుతారు. మరి సినిమాలో కూడా చివర్లో రవితేజ పాత్రను ఇలానే ముగించారా? ఇలాంటి ట్రాజెడీ ఎండింగ్ ను తెలుగు ప్రేక్షకులు అంగీకరిస్తారా?

ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం చెప్పడానికి నిరాకరించాడు దర్శకుడు వంశీ. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో క్లయిమాక్స్ ఎలా ఉంటుందో సినిమా చూసి తెలుసుకోమంటున్నాడు.

“రవితేజ పాత్రను ఎన్ కౌంటర్ ఎపిసోడ్ తో ముగించానా లేదా అనే విషయాన్ని నేను ఇప్పుడే చెప్పలేను. ఇదొక కమర్షియల్ ఫిలిం. అందరూ అనుకుంటున్నట్టు ఎండ్ చేస్తే బాగోదు. కాబట్టి ఎలా ఎండ్ చేశానో సినిమా చూసి తెలుసుకోండి.”

ఈ సినిమాను యదార్థ ఘటనల ఆధారంగా తీయలేదంటున్నాడు దర్శకుడు. యదార్థ ఘటనల ఆధారంగా తీయడానికి తనకు ఎలాంటి రిఫరెన్సులు దొరకలేదని, కొన్ని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మిస్సయ్యాయని చెప్పుకొచ్చాడు. అందుకే యాదార్థ ఊహాగానాలు (ట్రూ రూమర్స్) ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు సినిమాను తెరకెక్కించాని అన్నాడు.

ఈ సినిమాలో నిజం ఎంత, కల్పితం ఎంత అనే విషయాన్ని తను సెపరేట్ చేసి చూడడం లేదని, కేవలం ఓ దొంగ జీవితాన్ని కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పే ప్రయత్నం మాత్రమే చేశానని అంటున్నాడు. దసరా కానుకగా థియేటర్లలోకి వస్తోంది టైగర్ నాగేశ్వరరావు సినిమా.