సాధువుగా బిగ్ బి.. కల్కి లో అమితాబ్ లుక్ ఇదే

ఉన్నట్టుండి సడెన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది ప్రాజెక్ట్-కె. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరగడం లేదు, హీరో కూడా దేశంలో లేడు. అయినప్పటికీ సినిమా పేరు సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. దీనికి కారణం…

ఉన్నట్టుండి సడెన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది ప్రాజెక్ట్-కె. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరగడం లేదు, హీరో కూడా దేశంలో లేడు. అయినప్పటికీ సినిమా పేరు సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. దీనికి కారణం అమితాబ్ బచ్చన్.

ఈరోజు బిగ్ బి పుట్టినరోజు. ఈ సందర్భంగా కల్కి సినిమా నుంచి ఆయన పోషిస్తున్న పాత్ర లుక్ ను విడుదల చేశారు. పోస్టర్ లో అమితాబ్ బచ్చన్ ఒక గుహలో తన ముఖాన్ని గుడ్డతో కప్పి, చేతిలో కర్రతో నిలబడి ఉన్న సాధువుగా కనిపించారు.

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమాలో మైథలాజికల్ టచ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ కోణంలో అమితాబ్ కనిపించనున్నారు. పైకి సాధువుగా కనిపించినప్పటికీ, సినిమాలో ఆయన దేవదూత పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

అమితాబ్ లుక్ రిలీజ్ చేసిన సందర్భంగా మరోసారి కల్కి బ్యాక్ డ్రాప్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. టీజర్ తో ఈ సినిమా నేపథ్యం ఏంటనే విషయాన్ని ఇప్పటికే చెప్పిన మేకర్స్.. అమితాబ్ లుక్ పోస్టర్ తో సినిమా థీమ్ ను మరోసారి పరోక్షంగా చెప్పినట్టయింది.

ఈ సందర్భంగా కల్కి విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చింది యూనిట్. ఈ సినిమాను ఇప్పటికే సంక్రాంతి బరి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సినిమా రిలీజ్ పై పుకార్లు ఊపందుకున్నాయి. 2024లో రాదని కొందరు, 2024 దసరాకు వస్తుందని మరికొందరు చెప్పుకొచ్చారు.

అయితే యూనిట్ మాత్రం 2024 ప్రధమార్థంలోనే థియేటర్లలోకి వస్తామని చెబుతోంది. ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. కల్కి సినిమాలో లెజెండ్ కమల్ హాసన్, విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.