న్యాయ వ్య‌వ‌స్థ‌పై వైసీపీ నేత హాట్ కామెంట్స్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన నేప‌థ్యంలో, అధికార వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి స్పందించారు. ఈ సంద‌ర్భంగా న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన నేప‌థ్యంలో, అధికార వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి స్పందించారు. ఈ సంద‌ర్భంగా న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

రాజ‌ధానిపై నిర్ణ‌యం చేసే హ‌క్కు శాస‌న వ్య‌వ‌స్థ‌కు లేద‌ని ఏపీ హైకోర్టు కామెంట్ చేయ‌డంపై ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

న్యాయ వ్య‌వ‌స్థ‌, శాస‌న వ్య‌వ‌స్థ‌ల‌లో ఎవ‌రు గొప్పో పూర్తిస్థాయిలో చ‌ర్చ జ‌ర‌గాల‌ని మోదుగుల డిమాండ్ చేశారు. న్యాయ వ్య‌వ‌స్థ నిద్ర‌పోతుందా? అని ఆయ‌న అభ్యంత‌ర‌క‌ర ప్ర‌శ్న వేశారు. న్యాయ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా చేయాల‌ని ఆయ‌న కోరారు.

అంబేద్క‌ర్ రాజ్యాంగాన్ని అవ‌మాన‌ప‌రుస్తారా? అని ఆయ‌న నిలదీశారు. ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అంశాల‌ను కోర్టులు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

త‌మ‌కు అవ‌స‌ర‌మైన అంశాల‌పైన్నే కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దేశ ప్రజలకు తెలుస‌న్నారు. రాష్టాన్ని  కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింద‌న్నారు. అందులో బీజేపీ పాత్ర కూడా ఉంద‌న్నారు.

రాష్ట్ర విభజనపై వేసిన పిటిషన్‌లపై ఎందుకు వాదనలు జరగడం లేద‌ని మోదుగుల ప్ర‌శ్నించారు.గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కోర్టులో పిటిషన్ వేసిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. 2019 లో వేసిన పిటిషన్‌ను కోర్టు ఎందుకు పట్టించుకోవడం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అసెంబ్లీలో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టులు చెప్పడం ఏంట‌ని ఆయ‌న ఆగ్ర‌హం, ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడు రాజధా నులకు తాము కట్టుబడి ఉన్నామ‌ని మ‌రోసారి ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ముందు రాష్ట్ర విభజన పిటిషన్‌లపై తీర్పులు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఇదిలా వుండ‌గా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వ్యాఖ్య‌లు న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు అందుకున్నాయి.