ఇనస్టాగ్రామ్ టు గ్యాంగ్ రేప్ వయా వాట్సాప్

ఇనస్టాగ్రామ్ లో పరిచయం చేసుకున్నాడు. తియ్యని మాటలు చెప్పాడు. తర్వాత ఫోన్ నంబర్ తీసుకొని వాట్సాప్ లోకి లాగాడు. మరింత తియ్యగా కబుర్లు చెప్పాడు. అట్నుంచి అటు తన గదికి పిలిపించుకున్నాడు. అప్పుడు అతడిలోని…

ఇనస్టాగ్రామ్ లో పరిచయం చేసుకున్నాడు. తియ్యని మాటలు చెప్పాడు. తర్వాత ఫోన్ నంబర్ తీసుకొని వాట్సాప్ లోకి లాగాడు. మరింత తియ్యగా కబుర్లు చెప్పాడు. అట్నుంచి అటు తన గదికి పిలిపించుకున్నాడు. అప్పుడు అతడిలోని మృగం బయటపడింది. అమ్మాయిని అత్యాచారం చేయడంతో పాటు.. తన ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్ కూడా చేశాడు. హైదరాబాద్ శివార్లలో జరిగింది ఈ ఘటన.

రాజేంద్రనగర్ పరిథిలోని సులేమాన్ నగర్ లో ఉంటున్నాడు 27 ఏళ్ల సాజిత్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాజిత్ కు నగరానికి చెందిన ఓ అమ్మాయి ఇనస్టాగ్రామ్ లో పరిచయమైంది. ఇతడి మాయమాటలకు ఆమె పడిపోయింది. తర్వాత వ్యవహారం వాట్సాప్ కు మారింది. వాట్సాప్ లో న్యూడ్ గా కనిపించేలా ప్రేరేపించాడు సాజిత్. అదంతా రికార్డ్ చేశాడు.

ఇక అప్పట్నుంచి ఆ వీడియో ఆధారంగా బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ కు రమ్మని చెప్పిన సాజిత్, ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకొని తన ఫ్రెండ్ రూమ్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడి స్నేహితులు కూడా ఆమెను అత్యాచారం చేశారు.

తను మోసపోయానని గ్రహించిన యువతి రహస్యంగా పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాజిత్ ను అరెస్ట్ చేశారు. అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.