ఈ వారం రిలీజయ్యే సినిమాలేంటి?

ఈ వారం 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఒక సినిమా ఈరోజే రిలీజ్ అవుతోంది. అదే “హే సినామిక”. దుల్కర్ సల్మాన్, అదితిరావు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లవ్ స్టోరీ ఇది. కొరియోగ్రాఫర్ బృంద…

ఈ వారం 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఒక సినిమా ఈరోజే రిలీజ్ అవుతోంది. అదే “హే సినామిక”. దుల్కర్ సల్మాన్, అదితిరావు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లవ్ స్టోరీ ఇది. కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ ఈ సినిమాతో డైరక్టర్ గా మారారు. తెలుగులో ఈ సినిమాకు బజ్ కాస్త తక్కువగానే ఉంది. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత అంతా ఈ కథతో ప్రేమలో పడతారని నమ్మకంగా చెబుతున్నాడు దుల్కర్.

ఇక రేపు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వస్తోంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్న శర్వానంద్, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. ఆమె గోల్డెన్ హ్యాండ్ ఈ సినిమాకు కలిసొస్తుందనేది అందరి నమ్మకం. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ వీకెండ్ థియేటర్లలోకొస్తున్న మరో మూవీ సెబాస్టియన్. కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా కథను ముందే చెప్పేసింది యూనిట్. ఇందులో హీరోకు రేచీకటి. దాన్ని దాచిపెట్టి పోలీస్ ఉద్యోగం సంపాదిస్తాడు హీరో. ఆ తర్వాత అతడికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి, వాటిని అతడు ఎలా అధిగమించాడనేది సినిమా స్టోరీ. శర్వానంద్ సినిమా కంటే, ఈ సినిమాకే ఎక్కువ ప్రచారం దక్కుతోంది.

ఇలా ఈ వీకెండ్ ఈ 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో అందరి చూపు శర్వానంద్ పైనే ఉంది. శ్రీకారం, మహాసముద్రం సినిమాలతో నిరాశపరిచిన ఈ హీరో 'ఆడవాళ్ల'తో ఎలా మెప్పిస్తాడో చూడాలి. అన్నట్టు ఈ వారం రిలీజ్ అవుతున్న ఏ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. కారణం భీమ్లానాయక్.