విశాఖ ఏపీకి ఆశాకిరణం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖ నామస్మరణే చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అయితే విశాఖను పాలనా రాజధానిగా చేయాలని సంకల్పించారు. ఇక ఎవరు కాదన్నా కూడా విశాఖ మెగా సిటీ. ఫ్యూచర్ ఆఫ్ ఏపీ ని కూడా చెప్పాలి. మరి అలాంటి సిటీలో చక్కగా ఒక ఇల్లు కట్టుకుని నివసించాలని అందరికీ కోరిక ఉంటుంది. కానీ విశాఖ మాత్రం నో చాన్స్ అంటుంది. అసలు అలాంటి అవకాశాలు ఏవీ ఎక్కడా లేవని కూడా చెప్పేస్తోంది. విశాఖ భూముల ధరలకు 2014 నుంచి బాగా పెరిగిపోతూ వచ్చాయి.
అలా భూముల ధరలకు రెక్కలు వచ్చి ఈ రోజుకు హార్ట్ ఆఫ్ ది సిటీలో గజం ఏకంగా లక్ష రూపాయలుగా పలుకుతోంది. అది కూడా సర్కార్ వారు కొత్తగా మార్చిన లెక్కన ప్రకారమే. అలా చూస్తే లేటెస్ట్ గా విశాహ సిటీ సహా జిల్లావ్యాప్తంగా భూముల విలువల పెంపునకు రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు పూర్తిచేసింది. ఇందుకు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదముద్ర కూడా వేసింది. తక్కువగా 10 శాతం, అత్యధికంగా 40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ లెక్కన చూస్తే విశాఖ సిటీలో గజం లక్ష రూపాయలు అయితే గ్రామీణంలో అది యాభై వేల దాకా పలుకుతోంది. ఇకా మారు మూలలలో సైతం గజం ఇరవై నుంచి పాతిక వేల దాకా ఉంటోంది. మరి ఈ లెక్కన చూస్తే ఏ మధ్యతరగతి అయినా వంద గజాల స్థలం విశాఖలో కొనుగోలు చేయాలంటే కోటి రూపాయలు చేతబట్టాలి. ఆ మీదట ఇల్లు కట్టాలి. ఒక విధంగా చూస్తే విశాఖలో ఇల్లు కట్టడం కానీ నివసించడం కానీ మిడిల్ క్లాస్ కే కాదు ఒక స్థాయి వారికి వెరీ కాస్ట్ లీ గురూ అన్నట్లుగానే ఉంది.
ఒకే లెక్కన భూముల ధరలను నలభై శాతానికి ప్రభుత్వం పెంచేయడం జరిగింది. గత ఏడాది కరోనా వల్ల రేట్ల మధింపు జరగలేదు. దాంతో పాతా కొత్తా అన్నీ కలిపి వాయించేశారు అని అంటున్నారు. మరి ప్రభుత్వ ధరలే ఠారెత్తించేలా ఉంటే ప్రైవేట్ వారు ఇంతకు రెట్టింపు రేట్లు వేసి భూములు అమ్ముతారు అంటే ఆశ్చర్యం లేదుగా. సో విశాఖను అలా చూసి వెళ్ళిపోవడమే బెటర్ తప్ప మనకూ ఒక ఇల్లు అక్కడ ఉండాలని ఎవరైనా అనుకున్నా అది అత్యాశే అవుతుందిపుడు.