ఏపీ స‌ర్కార్ చెప్పిందేంటి? చేస్తుందేంటి?

ఉద్యోగుల వేత‌నాల విష‌యంలో ఏపీ స‌ర్కార్ చెప్పిందేంటి? చేస్తున్న‌దేంటి? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పింఛ‌న్‌దారుల విష‌యంలో ప్ర‌భుత్వం మాట త‌ప్పింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంతాల్లో ఉన్న పెన్ష‌న‌ర్ల వేత‌నాల్లో కోత…

ఉద్యోగుల వేత‌నాల విష‌యంలో ఏపీ స‌ర్కార్ చెప్పిందేంటి? చేస్తున్న‌దేంటి? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పింఛ‌న్‌దారుల విష‌యంలో ప్ర‌భుత్వం మాట త‌ప్పింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంతాల్లో ఉన్న పెన్ష‌న‌ర్ల వేత‌నాల్లో కోత విధించారు. దీంతో వారు ల‌బోదిబోమంటున్నారు.

తిరుప‌తిలో ఓ వృద్ధ మ‌హిళా పెన్ష‌న‌ర్‌కు నూత‌న పీఆర్సీ అమ‌లు కాక మునుపు రూ.26 వేల వేత‌నం వ‌చ్చేది. నూత‌న పీఆర్సీ అమ‌లుతో ఆమె వేత‌నం రూ.32 వేల‌కు పెరిగింది. రూ.6 వేలు చొప్పున వేత‌నం పెరిగినందుకు ఆమెతో పాటు కుటుంబ స‌భ్యులు సంతోషించారు. అయితే వేత‌నం పెంపు సంతోషం నెల‌రోజుల ముచ్చ‌టే అని నిన్న‌టి తేలిపోయింది. ఈ నెల రూ.3 వేలు త‌గ్గిస్తూ ప్ర‌భుత్వం ఆమెకు వేత‌నం వేసింది. ఈ నేపథ్యంలో స‌ద‌రు పెన్ష‌న్‌దారు ఆశ్చ‌ర్యంతో పాటు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

క‌డ‌ప‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగి విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింది. గ‌త నెల వేత‌నంతో పోల్చితే ఈ నెల ఏకంగా రూ.6 వేల వేత‌నం త‌గ్గింది. ఇలా ప‌లువురు పింఛ‌న్‌దారుల వేత‌నాల్లో కోత‌లు ప‌డ‌డంతో ఇదెక్క‌డి న్యాయ‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవ‌ల ఏపీ హైకోర్టు ఉద్యోగుల వేత‌నాల‌కు సంబంధించి …ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒక్క రూపాయి కూడా త‌గ్గించ‌కూడ‌ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

ఒక‌వేళ త‌గ్గిస్తూ సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తామ‌ని కూడా హెచ్చ‌రించింది. అయిన‌ప్ప‌టికీ పింఛ‌న్‌దారుల విష‌యంలో ప్ర‌భుత్వం అమాన‌వీయంగా కోత విధించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక రెగ్యుల‌ర్ ఉద్యోగుల వేత‌నాల విష‌యంలో వివ‌రాలు తెలియాల్సి వుంది. మొత్తానికి ప్ర‌భుత్వం వేత‌నాల్లో కోత‌ల‌ను చాలా సౌక‌ర్యంగా స‌మ‌ర్థించుకుంటోంది. ఇవి కోత‌లు కావ‌ని, వేత‌నాల్లో స‌ర్దుబాట్లుగా చెప్పుకుంటోంది. 

7 Replies to “ఏపీ స‌ర్కార్ చెప్పిందేంటి? చేస్తుందేంటి?”

  1. ”కూటమి” ప్రభుత్వం అంతా మోసం, అన్యాయం! ఏ సూపర్ సిక్స్ యివ్వలేరు! ఆంధ్ర ప్రజలకు అంతా సూపర్ శాక్ మాత్రమే!

    1. ఒరేపెండరత్నం… అదిమార్చ్2022ఆర్టికల్… GAండుకొత్తసాఫ్ట్’వేర్’అప్డేట్’చేసిమొత్తంపెంటపెంటచేసాడు…

  2. mundara rastముందర రాష్ట్రానికి అవసరమైన పోలవరాన్ని తిరిగి పట్టాలమీద కు ఎక్కిస్తున్నారు పరిశ్రమలు తీసుకొస్తున్నారు రాజధానిని ఒక దారికి తీసుకొస్తున్నారు వీటి అన్నిటికి కలిపి సెంటర్ సాయం చెయ్యక పోయిన ఇంచుమించు లక్ష యాభై వేలకోట్లు వరకు అవును రోడ్స్ కి ఒక ఇరవై వేలకోట్లు అవును పది లక్షల కోట్లు అప్పు తెచ్చి పాలస్ లు కట్టుకున్నోడికి రాష్ట్రానికి ప్రాణ సమాన మైన ప్రాజెక్టులు కు మాత్రం మూలాన పెట్టేసేడు

  3. ముందర రాష్ట్రానికి అవసరమైన పోలవరాన్ని తిరిగి పట్టాలమీద కు ఎక్కిస్తున్నారు పరిశ్రమలు తీసుకొస్తున్నారు రాజధానిని ఒక దారికి తీసుకొస్తున్నారు వీటి అన్నిటికి కలిపి సెంటర్ సాయం చెయ్యక పోయిన ఇంచుమించు లక్ష యాభై వేలకోట్లు వరకు అవును రోడ్స్ కి ఒక ఇరవై వేలకోట్లు అవును పది లక్షల కోట్లు అప్పు తెచ్చి పాలస్ లు కట్టుకున్నోడికి రాష్ట్రానికి ప్రాణ సమాన మైన ప్రాజెక్టులు కు మాత్రం మూలాన పెట్టేసేడు

  4. అల్లర్లను దొమ్మీలను నమ్ముకొన్న పార్టీ ని డీల్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అసలే తుని సంఘటన చూసేక ఎవరైనా జాగ్రత్తగా వుంటారు కదా వైసీపీ స్పాన్సర్ చేసిందని ముద్రగడ గారే మొత్తం చెప్పేసేరు

Comments are closed.