రామ్ చరణ్ ఆలోచనలు వేరే

ఆర్ఆర్ఆర్, ఆచార్య తరువాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఎవరికి? డైరక్టర్ ఎవరు అన్న పాయింట్ అలాగే వుంది.  Advertisement వంశీ పైడిపల్లితో సినిమా, దిల్ రాజు నిర్మాణంలో అన్న టాక్ వుంది. కానీ…

ఆర్ఆర్ఆర్, ఆచార్య తరువాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఎవరికి? డైరక్టర్ ఎవరు అన్న పాయింట్ అలాగే వుంది. 

వంశీ పైడిపల్లితో సినిమా, దిల్ రాజు నిర్మాణంలో అన్న టాక్ వుంది. కానీ అది లేదని చాలా గట్టిగా వినిపిస్తోంది. యువి విక్కీకి ఓ సినిమా చేయాల్సి వుంది. 

డైరక్టర్ రెడీ అయితే ఆ సినిమానే తరువాత సినిమా అన్న టాక్ వుంది. కానీ ఈరెండూ కాకుండా మరో ఇద్దరు నిర్మాతలు రామ్ చరణ్ కోసం లైన్లో వున్నారని తెలుస్తోంది. 

వారిలో ఓ నిర్మాత ఇండస్ట్రీకి కొత్త అని, అయితే చరణ్ కు మాంచి సన్నిహితుడు అని, అందుకే అతనికి ఓ సినిమా చేసే ఆలోచనలో వున్నారని, ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అలాగే మరో నిర్మాత కూడా లైన్ లో వున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ సమస్య ఒకటే డైరక్టర్ ఎవరు? అన్నది. సరైన కథ ఎవరు తెస్తే వాళ్ల ప్రాజెక్టును ఈ నిర్మాతల్లో ఒకరికి అటాచ్ చేసే ఆలోచనలో చరణ్ వున్నారని తెలుస్తోంది.

వ‌చ్చే సంవ‌త్స‌రం పెళ్లి చేసుకుంటాను