కరోనా టైమ్ లో ఈ పోటీ అవసరమా?

అసలే కరోనా కాలం. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. 50శాతం ఆక్యుపెన్సీతో కిందామీద పడి నడిపిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో కూడా సినిమాల మధ్య పోటీ అవసరమా? రామ్ మాత్రం ఇదేదీ ఆలోచించినట్టు లేడు. తన…

అసలే కరోనా కాలం. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. 50శాతం ఆక్యుపెన్సీతో కిందామీద పడి నడిపిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో కూడా సినిమాల మధ్య పోటీ అవసరమా? రామ్ మాత్రం ఇదేదీ ఆలోచించినట్టు లేడు. తన సినిమాను కూడా 14వ తేదీనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.

సంక్రాంతి బరిలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మొట్టమొదటి సినిమా క్రాక్. 14వ తేదీన తమ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు రవితేజ ఆల్రెడీ ప్రకటించాడు. డేట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు.

సో.. ఈ తేదీకి ఒక రోజు ముందు లేక మరుసటి రోజు రెడ్ సినిమాను రిలీజ్ చేస్తే బాగుండేది. కానీ రెడ్ ను కూడా 14నే రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లన్నీ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న ఈ టైమ్ లో ఒకేరోజు 2 సినిమాల రిలీజులంటే.. అది అందరికీ ఇబ్బందే.

ఏ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ దొరకవు, ఏ సినిమాకు మంచి వసూళ్లు రావు. ఈ విషయం తెలిసి కూడా రామ్ ఎందుకో వెనక్కి తగ్గలేదు. అలాంటప్పుడు క్రాక్ సినిమా కంటే ముందే తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినా బాగుండేది

నిజానికి సంక్రాంతికి సినిమాల మధ్య పెద్ద పోటీ లేదు. వస్తుందనుకున్న వకీల్ సాబ్ సమ్మర్ కు షిఫ్ట్ అయింది. చివరికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రంగ్ దే సినిమాలు కూడా రావడం లేదు. ఇలాంటి టైమ్ లో కాస్త ప్లానింగ్ తో, ఇంకాస్త సామరస్యంతో వ్యవహరించి ఉంటే అటు క్రాస్, ఇటు రెడీ సినిమాలు రెండూ లాభపడేవి. 

జ‌గ‌న్ రికార్డ్ సృష్టించిన‌ట్లేనా..!