హనుమంతన్నకు ఆ కులంపై అంత కక్ష ఉందా

3 శాతం, కేవలం 3 శాతం ఉన్న ఆ సామాజిక వర్గం పెత్తనం రాష్ట్రంపై ఏంటి అంటూ తన ఆక్రోశాన్నంతా వెళ్లగక్కారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. ఇన్నాళ్లూ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి…

3 శాతం, కేవలం 3 శాతం ఉన్న ఆ సామాజిక వర్గం పెత్తనం రాష్ట్రంపై ఏంటి అంటూ తన ఆక్రోశాన్నంతా వెళ్లగక్కారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. ఇన్నాళ్లూ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి వద్దంటే వద్దన్న హనుమంతన్నకు టీడీపీ నుంచి వచ్చాడనే కారణంతో ఆయనపై అంత కోపం ఉంది కాబోలు అని అనుకున్నారంతా. 

కానీ ఆయన కడుపుమంట అంతా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చినందుకు కాదు, కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్న సీనియర్లను అధిష్టానం పక్కనపెట్టినందుకూ కాదు. కేవలం రేవంత్ సామాజిక వర్గం గురించే హనుమంతరావు బాధంతా.

వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణకు వెళ్లిన వీహెచ్… కాపులకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. పనిలో పనిగా పవన్ కల్యాణ్ కాంగ్రెస్ లోకి వస్తే తెలంగాణ పీసీసీ పదవి ఇప్పిస్తానంటూ ఏదేదో మాట్లాడేశారు. దాదాపుగా టీపీసీసీ రేవంత్ కి ఖరారైపోయిన వేళ, మరోసారి ఆ పదవికి పవన్ కల్యాణ్ కి లింకు పెట్టి ఆవేశ పడ్డారు హనుమంతన్న.

ఆ ఆవేశంలోనే అసలు విషయం కూడా చెప్పుకొచ్చారు. కేవలం 3 శాతం ఉన్న ఆ సామాజికవర్గానికే అన్ని పదవులూ ఎందుకంటూ ప్రశ్నించారు. పీసీసీ పదవి బీసీలకు ఇవ్వాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు, కనీసం బీసీల్లో అర్హులు లేకపోతే పక్క పార్టీ నుంచి పవన్ కల్యాణ్ ని తీసుకొచ్చి అయినా ఇవ్వాలని, అంతేకానీ ఆ సామాజిక వర్గానికి మాత్రం ఇవ్వొద్దని మనసులో మాట బయటపెట్టేశారు.

జగన్ పై కూడా వీహెచ్ కి అదే అక్కసు..

ఉమ్మడి రాష్ట్రంలో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కూడా వి.హనుమంతరావు అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసేవారు. వైఎస్ఆర్ మహాభినిష్క్రమణం తర్వాత కాంగ్రెస్ హై కమాండ్ కి జగన్ పై చాడీలు చెప్పడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. సీనియర్లు ఏం చెబితే అది నమ్మే అధిష్టానం.. ఈ చాడీలతోనే జగన్ ని దూరం చేసుకుంది, ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది.

అప్పట్లో జగన్ పై హనుమంతన్నకు ఉంది కేవలం జూనియర్, సీనియర్ అనే ఇగో మాత్రమే అనుకున్నారంతా. కానీ ఆయనలో ఉన్నది కుల దురాభిమానమని ఇప్పుడు తేటతెల్లమైంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించొద్దంటూ నానా యాగీ చేస్తున్న హనుమంతరావు.. ఆ 3 శాతం అంటూ రెచ్చిపోతున్నారు. 

జ‌గ‌న్ రికార్డ్ సృష్టించిన‌ట్లేనా..!