జగన్ కృషికి ఫలితం…జీవీఎంసీకి ప్రతిష్టాత్మక అవార్డు

ఏపీలోనే మేటి నగరంగా ఉన్న విశాఖకు కేంద్రం అవార్డుని ప్రకటించింది. జీవీఎంసీ ఆధునాతన సాంకేతిక సహకారంతో నగరంలో గృహాలను నిర్మించినందుకు గానూ ఈ ప్రతిష్టాత్మక  అవార్డును అందచేయనున్నారు.  Advertisement ప్రధానమంత్రి ఆవాస యోజన పధకాన్ని…

ఏపీలోనే మేటి నగరంగా ఉన్న విశాఖకు కేంద్రం అవార్డుని ప్రకటించింది. జీవీఎంసీ ఆధునాతన సాంకేతిక సహకారంతో నగరంలో గృహాలను నిర్మించినందుకు గానూ ఈ ప్రతిష్టాత్మక  అవార్డును అందచేయనున్నారు. 

ప్రధానమంత్రి ఆవాస యోజన పధకాన్ని విజయవంతంగా పూర్తి చేయడమే కాదు, సాంకేతిక సంపత్తిని కూడా జోడించడంతో ఈ అవార్డు దక్కుతోంది.

విశాఖ మీద ప్రత్యేక దృష్టి కనబరచి ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికపుడు ఇస్తున్న‌ సలహాలు సూచనాలతో ఈ అవార్డు దక్కిందని జీవీఎంసీ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే కొత్త ఏడాది జనవరి 1న వర్చువల్ విధానంలో ఈ అవార్డును ముఖ్యమంత్రి జగన్ కి ప్రధాని నరేంద్రమోడీ అందచేయనున్నారు.  ఇప్పటిదాకా ఏపీకి ఎన్నో అవార్డులు వచ్చాయి. గత ఏడాదిన్నరగా కూడా ఎక్కువగానే  వస్తున్నాయి. 

మరి అవార్డులు వస్తే తమ ఘనత అని చెప్పుకున్న నాటి టీడీపీ సర్కార్ పెద్దలు ఇపుడు జగన్ పాలనలో అవార్డులు రావడాన్ని ఏ విధంగా మెచ్చుకుంటారో  చూడాలి. ఏది ఏమైనా ఒక ప్రధాని ముఖ్యమంత్రికి అవార్డు ఇవ్వడం అది కూడా అభివృద్ధి విషయంలో అంటే అది నిజంగా రికార్డే సుమా.

జ‌గ‌న్ రికార్డ్ సృష్టించిన‌ట్లేనా..!