బాలయ్య 109 వ సినిమా ఏ డైరక్టర్ తో అన్న డిస్కషన్ చిరకాలంగా వినిపిస్తోంది. బోయపాటి అని చాలా కాలం కిందటి నుంచి వార్తలు వున్నాయి. కానీ రామ్ తో బోయపాటి చేస్తున్న సినిమా లేట్ కావడంతో బాలయ్య ఈ గ్యాప్ లో మరో సినిమా చేస్తారని వార్తలు వినవచ్చాయి.
లేటెస్ట్ గా హిట్ ఇచ్చిన డైరక్టర్ బాబీతో సినిమా ఫిక్స్ అనే వార్తలు కూడా వినిపించాయి. డిసెంబర్ లో ఎన్నికలు వుంటే ఏ సినిమా చేయరు అని, అలా కాకపోతే చేస్తారని కూడా వార్తలు వున్నాయి.
అయితే మొత్తం మీద బాబీతోనే సినిమా పక్కా అని గట్టిగా వినిపిస్తూ వచ్చింది ఇటీవల. కానీ ఇప్పుడు లేటెస్ట్ వార్తలు ఏమిటంటే బాలయ్య 109 వ సినిమా బోయపాటితోనే అని. ఈ మేరకు అంతా ఫిక్స్ అయిందని, బోయపాటి వచ్చే వరకు వెయిట్ చేయడానికే బాలయ్య మొగ్గు చూపుతున్నారని, ఆ తరువాతే బాబీ సినిమా చేస్తారని తెలుస్తోంది.
ఈ మేరకు బోయపాటి-బాలయ్య ల నడుమ రెండు రోజుల పాటు వరుసగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. బోయపాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని, ఆయన డిసైడ్ చేసుకున్న తరువాతే తాను ఏం చేయాలన్నది ఆలోచిస్తానని బాలయ్య క్లారిటీగా చెప్పినట్లు తెలుస్తోంది. మరి బాబీ ఈ లోగా మరో సినిమా చేసి వస్తారా? ఏ హీరో దొరుకుతారు అన్నది చూడాలి.