రాధేశ్యామ్..థ్రిల్లింగ్ ట్రయిలర్

బాహుబలి ప్రభాస్…నటించిన రాధేశ్యామ్ నుంచి రిలీజ్ ట్రయిలర్ వచ్చింది. ఇప్పటికే ఓ ట్రయిలర్, టీజ‌ర్, పాటలు ఇన్ని కట్ చేసారు కదా. మళ్లీ కంటెంట్ ఇంకేం వుంటుంది అనుకున్నారంతా. కానీ రిలీజ్ ట్రయిలర్ ఇప్పటికి…

బాహుబలి ప్రభాస్…నటించిన రాధేశ్యామ్ నుంచి రిలీజ్ ట్రయిలర్ వచ్చింది. ఇప్పటికే ఓ ట్రయిలర్, టీజ‌ర్, పాటలు ఇన్ని కట్ చేసారు కదా. మళ్లీ కంటెంట్ ఇంకేం వుంటుంది అనుకున్నారంతా. కానీ రిలీజ్ ట్రయిలర్ ఇప్పటికి వదిలిన అన్ని కంటెంట్ ల కన్నా బాగుంది. 

ఇప్పటి వరకు రాధేశ్యామ్ సినిమా ఓ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగానే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ట్రయిలర్ చిన్న థ్రిల్లర్ టచ్ తో వచ్చింది. పైగా కామన్ ఆడియన్ ను కూడా ఆకట్టుకునేలా పక్కా ఓ మీటర్ మీద వెళ్లింది. 

సినిమాలో కేవలం హీరో హీరోయిన్ల లవ్..రొమాన్స్ నే కాదు..అంతకు మించి వుంది అన్న ఫీల్ ను ట్రయిలర్ కలిగించింది. ‘నేను ఒకసారి చూసిన చేయి మరోసారి చూడను’ అనే డైలాగు దగ్గర మాస్ ప్రేక్షకులకు కావాల్సిన ఫీల్ వుంది.

మొత్తం మీద రాధేశ్యామ్ కొత్త ట్రయిలర్ నిడివి చిన్నదైనా పక్కాగా సెట్ అయింది. విడుదల ముందు సినిమాకు మరింత బజ్ తెచ్చేలా వుంది.