పార్టీనా బొక్కా అంటూ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా రహస్య కెమెరాకు చిక్కిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడిపై మరోసారి నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై అచ్చెన్నాయుడి తాజా కామెంట్సే ఆయనపై ట్రోలింగ్‌కు కారణమయ్యాయి.
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుందని అనుకోవద్దన్నారు. ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని ఆయన అన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించడం గమనార్హం. ఈ దఫా ఖచ్చితంగా 160 సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఈ స్థాయిలో వ్యతిరేకతను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.
అచ్చెన్న ముందస్తు ఎన్నికల ప్రకటపై నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెట్టారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చంటున్నారు… ఎందుకూ బహిష్కరించడానికా అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున వ్యంగ్య కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు.
గతంలో స్థానిక సంస్థల ఎన్నికలొస్తే… ఏం చేశారు అచ్చెన్న సారు? ఇప్పుడు ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలొస్తే అదే కదా చేసేది పార్టీనా బొక్కా ఫేమ్ అంటూ సెటైర్స్ విసురుతున్నారు. ఇంతకూ అసెంబ్లీ ఎన్నికలు ముందే వస్తే, లోకేశ్ సంగతేంటి? అసలే నియోజకవర్గం లేకపాయె, ముందు ఆయనకో స్థిర నివాసం ఏర్పాటు చేయండి అంటూ వెటకరిస్తున్నారు.
ఇటీవల కాలంలో చంద్రబాబు మొదలుకుని టీడీపీ ముఖ్య నేతలంతా పదేపదే ముందస్తు ఎన్నికలపై వ్యూహాత్మకంగా మాట్లాడుతుండడాన్ని గమనించొచ్చు. పార్టీని కాపాడుకునే క్రమంలోనే టీడీపీ ముందస్తు జపం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.