రామ‌ల‌క్ష్మి పాత్ర‌కు న‌న్ను వ‌ద్ద‌న్నార‌ట‌…

న‌టీన‌టుల జీవితాల్లో కేవ‌లం ఒకే ఒక్క పాత్ర వాళ్ల కెరీర్‌ను మ‌లుపు తిప్పుతుంటోంది. అదే ఆ న‌టుల జీవితంలో చిర‌స్థాయిగా నిలిచిపోతుంటుంది. కొంద‌రైతే కెరీర్‌లో లైఫ్ ఇచ్చిన ఆ సినిమా పేరుతోనే పాపుల‌ర్ అవుతుంటారు.…

న‌టీన‌టుల జీవితాల్లో కేవ‌లం ఒకే ఒక్క పాత్ర వాళ్ల కెరీర్‌ను మ‌లుపు తిప్పుతుంటోంది. అదే ఆ న‌టుల జీవితంలో చిర‌స్థాయిగా నిలిచిపోతుంటుంది. కొంద‌రైతే కెరీర్‌లో లైఫ్ ఇచ్చిన ఆ సినిమా పేరుతోనే పాపుల‌ర్ అవుతుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శుభ‌లేఖ సుధాక‌ర్ …ఇలా మ‌రికొంద‌రి పేర్లు చెప్పుకోవ‌చ్చు.

ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత కెరీర్‌ను రంగ‌స్థ‌లం సినిమా మ‌లుపు తిప్పింద‌ని చెప్పొచ్చు. ఆ సినిమా విడుద‌ల త‌ర్వాత స‌మంత ఇమేజ్ అమాంతం పెరిగింది. 

స‌మంత‌కు రంగ‌స్థం సినిమా మ‌రుపురానిదిగా గుర్తుండిపోతుంది. అయితే ఆ సినిమాలో గ్రామీణ పిల్ల‌గా రామ‌ల‌క్ష్మి పాత్ర‌కు స‌మంత స‌రిపోర‌ని డైరెక్ట‌ర్ సుకుమార్‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ చెప్పార‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా స‌మంత‌నే ఓ టాక్‌షోలో చెప్పుకొచ్చారు.

రామ‌ల‌క్ష్మి పాత్ర‌కు త‌న‌ను ఎంపిక చేసిన‌ప్పుడు, దాని వెనుకాల ఏం జ‌రిగిందో స‌మంత వివ‌రించారు. రంగ‌స్థ‌లం సినిమాలో రామ‌ల‌క్ష్మి పాత్ర‌కు మొట్ట‌మొద‌ట త‌న‌ను తీసుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ వ‌ద్ద‌ని అభ్యంత‌రం చెప్పిన‌ట్టు త‌న దృష్టికి వ‌చ్చిన‌ట్టు ఆమె తెలిపారు. 

గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న త‌న‌న‌ను ప‌ల్లెటూరి అమ్మాయిగా ప్రేక్ష‌కులు ఒప్పుకోరేమో అని డైరెక్ట‌ర్ సుకుమార్ వ‌ద్ద‌ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అనుమానం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింద‌న్నారు.

అయితే అలాంటి అనుమానాలేవీ ప‌ట్టించుకోకుండా, మ‌న‌సులోకి ఎక్కించుకోకుండా డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న‌పై ఎంతో న‌మ్మ‌కం ఉంచి రామ‌ల‌క్ష్మి పాత్ర‌కు ఎంపిక చేశార‌న్నారు. రామలక్ష్మి పాత్ర గురించి డైరెక్ట‌ర్ చెప్పినప్పుడు తాను చాలా ఉద్వేగానికి గురై న‌ట్టు స‌మంత తెలిపారు. ఆ పాత్ర త‌న కెరీర్‌లో ఓ స‌వాల్‌గా తీసుకున్న‌ట్టు ఆమె పేర్కొన్నారు.

సినిమా విడుదల తర్వాత వచ్చిన స్పందన ఎంత అద్భుతంగా ఉందో అంద‌రికీ తెలిసిందే అని స‌మంత వివ‌రించారు. కెరీర్‌లో వైవిధ్య‌భ‌రిత‌మైన స‌మంత లాంటి పాత్రలు చేయడం వల్ల కొత్త అనుభూతిని పొందుతామని సమంత  చెప్పుకొచ్చారు. 

పెళ్లి త‌ర్వాత కూడా మునుప‌టి వ‌లే అవ‌కాశాల‌ను స‌మంత ద‌క్కించుకుంటున్నారంటే, కేవ‌లం రంగ‌స్థలంలో రామ‌ల‌క్ష్మి పాత్ర సృష్టించిన ఇమేజ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

అన్ని కులాలుంటేనే రాజధాని