విశాఖ సిటీని కరోనా కొత్త స్టెయిన్ కలవరం రేపుతోంది. యూకే రిటర్నీగా గుర్తించిన రాజమండ్రీ మహిళ ప్రయాణించిన ఏపీ ఎక్స్ ప్రెస్ బోగీలో ఆమెతో పాటు ప్రయాణించిన మరో ఎనిమిది మంది విశాఖ జిల్లాలో దిగారు అన్నది అధికారులకు అందిన తాజా సమాచారం
దాంతో ఒక్కసారిగా కరోనా కొత్త స్ట్రెయిన్ భయంలో విశాఖ సిటీ వణుకుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లి లాడ్జిలో ఓ ముగ్గురుని ఈ విధంగా ఏపీ ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రీకి చెందిన మహిళ ప్రయాణించిన బోగీల కలసి వచ్చారని అధికారులు గుర్తించి వారిని కరోనా నిర్ధారణ పరీక్షల కొసం విశాఖ కేజీహెచ్ కి తరలించారు.
మరో అయిదుగురి ఆచూకీని కూడా పట్టుకునే ప్రయత్నాన్ని అధికారులు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే వీరందరినీ కేజీహెచ్ లోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకి తరలించి ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
విశాఖలో కరోనా కొత్త స్ట్రెయిన్ వార్తలు వినడంతోనే స్టీల్ సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. సెకండ్ కాంటాక్ట్ కేసులు కూడా ఎవైనా ఉంటే కనుక విశాఖకు కొత్త స్ట్రెయిన్ ఇబ్బందులు తప్పవని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏదేమైనా విశాఖ సిటీ ఇపుడు కొత్త టెన్షన్ లొ ఉంది.