వారియర్ @ రూ. 35 కోట్లు

హీరో రామ్ సినిమా కళ్లుచెదిరే రేంజ్ లో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తోంది. యాక్షన్ మూవీ కావడం, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటికే…

హీరో రామ్ సినిమా కళ్లుచెదిరే రేంజ్ లో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తోంది. యాక్షన్ మూవీ కావడం, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ను భారీ ధరకు అమ్మేశారు. తాజాగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ డీల్ కూడా పూర్తయింది.

ది వారియర్ సినిమా శాటిలైట్-డిజిటల్ రైట్స్ ను డిస్నీ గ్రూప్ దక్కించుకుంది. ఈ మేరకు శాటిలైట్ హక్కులు స్టార్ మా ఛానెల్ కు, స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ హాట్ స్టార్ ఓటీటీకి దక్కాయి. ఈ మొత్తం డీల్ కాస్త అటుఇటుగా 35 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్ ఇది.

గతేడాది సంక్రాంతికొచ్చిన రెడ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అప్పట్నుంచి ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. అయినప్పటికీ రామ్ నటిస్తున్న తాజా చిత్రానికి ఈ స్థాయిలో బిజినెస్ జరగడం విశేషం. ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నాడు ఈ హీరో.

లింగుసామి డైరక్ట్ చేస్తున్న ఈ మూవీలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు రామ్. దీంతో పాటు సినిమాలో మరో గెటప్ లో కూడా అతడు కనిపిస్తాడు. కాకపోతే ఆ విషయాన్ని మేకర్స్ సీక్రెట్ గా ఉంచుతున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.