ఆసియా దేశాల్లోనే ఎక్కవమంది శాకాహారం తింటారనే వాదన ఉంది. కానీ అది నిజం కాదనే విషయాన్ని ఓ గ్లోబల్ సర్వే నిగ్గుతేల్చింది. ప్రపంచంలో ఎక్కువమంది శాకాహారులు ఉన్న దేశంగా ఇండియా గుర్తింపు పొందింది. ఆ తర్వాత స్థానంలో ఇజ్రాయెల్ ఉంది. మూడో స్థానంలో తైవాన్, నాలుగో స్థానంలో ఇటలీ, ఐదో స్థానంలో ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే ఉన్నాయి. ఈ దేశాల్లో కేవలం 9శాతం మంది మాత్రమే శాకాహారం తీసుకుంటారట.
ఇక లిస్ట్ లో చివరి స్థానంలో రష్యా ఉంది. ఈ దేశంలో కేవలం 1 శాతం మంది మాత్రమే వెజిటేరియన్లు. మిగతా 99శాతం మంది మాంసాహారం తింటారట. ప్రపంచం మొత్తమ్మీద కేవలం శాకాహారం తినేవారి సంఖ్య 88 మిలియన్లు. వీళ్లలో మూడో వంతు స్త్రీలు. భారతదేశంలో 9శాతం మంది శాకాహారులున్నారట. బ్రిటన్ లో 20 లక్షలు, అమెరికాలో 15 మిలియన్ల కంటే ఎక్కువమంది శాకాహారులున్నారట.
ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందంట. వెజిటేరియన్ ఫుడ్ మార్కెట్ 2026 నాటికి 3.14 బిలియన్ డాలర్ల మేరకు పెరుగుతుందంట. అంతేకాదు, గతేడాది వెజిటేరియన్ మాత్రమే తింటామంటూ 6 లక్షల మందికి పైగా వ్యక్తులు శపథం చేశారట. 2024కు ఆ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని అంచనా
ఇక వెజిటేరియన్లలో వేగన్ లు సెపరేట్. వీళ్లు శాకాహారులు మాత్రమే కాదు, జంతు సంబంధ ఉత్పత్తుల్ని కూడా వీళ్లు ఉపయోగించరు. వెజిటేరియన్, నాన్-వెజిటేరియన్లు కాకుండా, మరికొన్ని రకాల వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్లలో ముఖ్యులు పెస్కటేరియన్లు.
మాంసం తినని వ్యక్తి చేపలు తింటాడు. వీళ్ల దృష్టిలో చేపలు నాన్-వెజ్ కాదు. ఇండియాలో చాలామంది గుడ్డును నాన్-వెజ్ గా చూడరు. ఇది కూడా అలాంటిదే. ఇలాంటి వ్యక్తుల్ని పెస్కటేరియన్లు అంటారు. ఇక ఫ్లెక్సిటేరియన్లు కూడా ఉన్నారు. ఎక్కువమంది వ్యక్తులు శాకాహారమే తింటారు. అయితే అప్పుడప్పుడు మాంసాహారం లాగించేస్తారు. ఇలా వెజ్, నాన్-వెజ్ విషయంలో ఫ్లెక్సిబుల్ గా ఉండే వాళ్లను ఫ్లెక్సిటేరియన్లు అంటారు.