‘ ఫాదర్- చిట్టి – ఉమ – కార్తీక్’

అలా మొదలైంది, కళ్యాణ్ వైభోగమే లాంటి మాంచి సినిమా అందించి కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీ రంజిత్ మూవీస్ మళ్లీ నిర్మాణం స్టార్ట్ చేసింది. *జగపతిబాబు ప్రధాన పాత్రలో ‘కార్తీక్, అమ్ము అభిరామి‘ యువ…

అలా మొదలైంది, కళ్యాణ్ వైభోగమే లాంటి మాంచి సినిమా అందించి కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీ రంజిత్ మూవీస్ మళ్లీ నిర్మాణం స్టార్ట్ చేసింది. *జగపతిబాబు ప్రధాన పాత్రలో ‘కార్తీక్, అమ్ము అభిరామి‘ యువ జంటగా సినిమాను నిర్మించి విడుదలకు రెడీ చేస్తోంది.  

దర్శకుడు విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రానికి ఫాదర్..చిట్టి..ఉమ..కార్తీక్ అనే వైవిధమైన టైటిల్ ఫిక్స్ చేసారు.  ఈ సందర్భంగా నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ తమ సంస్థ నిర్మించే ఈ 14వ సినిమాకు కథకు అనుగుణంగా టైటిల్ పెట్టామన్నారు. 

చిత్ర నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.   ధియేటర్ లలోనే ఈ చిత్రాన్ని జనవరి 2021 లో  విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు 

దర్శకుడు విద్యాసాగర్ రాజు మాట్లాడుతూ…‘ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‘ గా ఈ చిత్రానికి రూపకల్పన చేయటం జరిగింది. 'ఫాదర్- చిట్టి – ఉమ –  కార్తీక్' అనే పాత్రల మధ్య జరిగే ఈ చిత్ర కథలో భావోద్వేగాలు, వినోదం సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి అని తెలిపారు దర్శకుడు. 

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్ తదితరులు నటిస్తున్నారు.

అభిజిత్ బ్రేక‌ప్ ఏమైంది ?